Chiyaan Not Interested on Politics | రాజకీయాలా.. నా వల్ల కాదు బాబోయ్..

Actor vikram on politics

Actor Vikram, Kollywood Celebrities, Politics, Vikram Political Entry, Chiyaan Vikram Politics

Actor Vikram open on Politics. I can't even wear the 'pancha' properly. Politics doesn't suit me. Films are my life Vikram Added.

రాజకీయాలు నా వల్ల కాదు : విక్రమ్

Posted: 01/24/2018 05:11 PM IST
Actor vikram on politics

తమిళ రాజకీయాల్లోకి సినిమా వాళ్ల ప్రవాహం ఇప్పుడు ఎక్కువైపోయింది. అగ్ర హీరోలు రజనీకాంత్, కమలహాసన్‌ ల ప్రకటనతో ఇది మరింత పుంజుకుంది. వీరి బాటలో భాగ్యరాజ్(రీఎంట్రీ లేండి) లాంటి మరికొందరు సీనియర్లు, విశాల్ లాంటి యువ హీరోలు రాజకీయాలవైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు విక్రమ్ ని మీడియా రాజకీయాల గురించి ఆరా తీసింది.

దీనికి విక్రమ్ కూడా భిన్నంగా స్పందించాడు. తనకు రాజకీయాలు సరిపడవని తేల్చేశాడు. ‘‘నేను చాలా సిగ్గరిని, కెమెరా ముందుంటే ఏమీ గుర్తుకు రాదు. ఏదో సినిమా అంటే సీన్‌లో లీనమైపోయి నటిస్తుంటా. అంతేగానీ రాజకీయాలు నా వల్ల కానేకాదు. అసలు పంచె కట్టుకోవటమే రాని తాను ఇంక రాజకీయాలేం చేస్తానని స్పష్టం చేసేశాడు.

సినిమానే తన జీవితమని, నటనకే తన ప్రాధాన్యమని విక్రమ్ చెప్పాడు. కాగా, నటనకు వయసుతో సంబంధం ఉండబోదని, తాను ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా సిద్ధమేనని విక్రమ్ చెప్పాడు. ఈ విషయంలో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ స్ఫూర్తి అని చెప్పాడు. తన అబ్బాయి చేస్తోన్న ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ని తనతో తీస్తామని తన దగ్గరికి వచ్చి చెప్పినా తాను చేసుండేవాడినని నవ్వుతూ చెప్పాడు విక్రమ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles