Vinayak Dharam Tej Inttelligent Completed | ఇంటిలిజెంట్.. ఓ పనైపోయిందిగా

Sai dharam tej vinaky movie updates

VV Vinayak, Sai Dharam Tej, Inttelligent Movie, Inttelligent Press Meet, Inttelligent Shoot Completed

VV Vinayak, Sai Dharam Tej speak on 'Inttelligent'. Vinayak Dharam Tej Spoke on Press Meet.

వినాయక్-సాయి ధరమ్ తేజ్.. ఓ పనైపోయింది

Posted: 01/24/2018 07:05 PM IST
Sai dharam tej vinaky movie updates

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'ఇంటిలిజెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వినాయక్ మార్క్ కి .. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఈ సినిమా రూపొందిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్టు నిన్నటితో పూర్తయింది.

సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ తో సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ వస్తోంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో సాయిధరమ్ తేజ్ వున్నాడు.

అయితే ఇదే రోజున వరుణ్ తేజ్ మూవీ 'తొలిప్రేమ' విడుదలవుతుండటం విశేషం. అయినప్పటకీ కంటెంట్ మీద నమ్మకంతో వినాయక్-సాయి ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles