యువ హీరోల్లో నాని - శర్వానంద్ ల ట్రాక్ రికార్డులు దాదాపు ఒకేలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి కలెక్షన్స్ ని అందిస్తున్నాడు.
అయితే ఈ మధ్యలో ఓ ప్రముఖ దినపత్రిక శర్వా కథనే నాని చేస్తున్నాడు అని వార్తలు రాయగా.. అది వైరల్ అయ్యింది. దీనిపై నాని స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ కథ శర్వాది కాదు. మొదట నా దగ్గరికి రాగానే ఒకే చేశాను అని నాని అనుమానాలకు తెరదించాడు. ఇంతకీ అది ఏంటో కాదు.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న కృష్ణార్జున యుద్ధం. ఇందులో నాని డ్యుయెల్ రోల్ చేస్తుండగా.. ఆ రోల్స్ లుక్కులు ఈ మధ్యే రివీల్ అయ్యాయి.
అనుపమ పరమేశ్వరన్, రక్షర్ లు హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. హిప్ హాప్ తమీజ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నేచురల్ స్టార్ సక్సెస్ ట్రాక్ ని పెంచుతుందో లేదో చూడాలి.
అ.. వాయిదా?
నటుడిగానే కాదు నాని.. నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్న విషయం తెలిసిందే. అదే అ!. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. ప్రమోషన్ పనులు కూడా ముందే మొదలుపెట్టేశారు. ముందుకు అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా ఫిబ్రవరి మొదటివారంలో థియేటర్లకు రావాల్సి ఉంది. దీనిని పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో నిర్మాత నానితోపాటు సినిమా యూనిట్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో చాలా సినిమాలు రిలీజుకు రెడీగా ఉన్నాయి. పోటీ మధ్య అ! సినిమా దింపడం వల్ల ఆశించిన కలెక్షన్లు రావనే ఉద్దేశంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయడమే మంచిదని నాని అండ్ టీం భావిస్తోంది. కొత్త డేట్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.
కాజల్ తో నాని...
నాగ్ తో నాని చేయబోయే మల్టీస్టారర్ కోసం కాజల్ ను ఎంచకున్నట్లు ఓ వార్త చక్కర్ల కొడుతోంది. భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more