Pawan kalyan Agnyaathavaasi Target Fixed Now | అజ్ఞాతవాసి రిలీజ్.. ఇప్పుడేం

Agnyaathavaasi target collections

Pawan Kalyan, Agnyaathavaasi, Agnyaathavaasi Collections, Agnyaathavaasi target, Agnyaathavaasi Worldwide Collections

Pawan Kalyan’s Agnyaathavaasi earns Rs 160 cr before release. The movie has to recover 125 Crore Share Worldwide to emerge as a Hit. Anything below 100 Crore Share is considered as a flop venture.

అజ్ఞాతవాసి ఇప్పుడెంత వసూలు చేయాలంటే...

Posted: 01/10/2018 03:48 PM IST
Agnyaathavaasi target collections

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లోని 'అజ్ఞాతవాసి' సినిమా, అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకి అమ్ముడయ్యాయి. మిగతా హక్కులు 35 కోట్లు కాగా, మొత్తం మీద 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 92 కోట్ల బిజినెస్ చేయగా, ఒక్క నైజామ్ హక్కులే 29 కోట్లు పలికాయి. ఇక ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లోను కలుపుకుని 63 కోట్లు పలకడం విశేషం. కర్ణాటక హక్కులు 11 కోట్లు పలకగా .. ఓవర్సీస్ హక్కులు 19.5 కోట్లు అమ్మకం జరిగింది. ఈ కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 125 కోట్ల షేర్ ను సాధించవలసిందేనని అంటున్నారు.

ఇప్పటివరకూ 105 కోట్ల షేర్ తో 'ఖైదీ నెంబర్ 150' నాన్ బాహుబలి రికార్డుతో కొనసాగుతోంది. ఆ రికార్డును 'అజ్ఞాతవాసి' అధిగమిస్తాడేమోననే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. వరుసగా సెలవులు రావటం సినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles