Mallika Sherawat Evicted From Paris Flat Confirmed | నిజమే! మల్లికను ఇంటి నుంచి గెంటేశారు

Mallika sherawat evicted from paris flat

Actor Mallika Sherawat, Paris Court, Cyrille Auxenfans, Mallika Sherawat Paris Court

Actor Mallika Sherawat Evicted From Paris Flat Over Unpaid Rent Of $94,000. In a December 14 ruling seen by AFP on Tuesday, the court told Sherawat and her French husband Cyrille Auxenfans to pay 78,787 euros ($94,000) in rent owed and expenses, giving the green light for their furniture to be seized.

మల్లికా ఇంటి కహానీ.. నిజమేనంట!

Posted: 01/10/2018 04:30 PM IST
Mallika sherawat evicted from paris flat

బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ కు ఊహించని ఝలక్ ఎదురైంది. అపార్ట్ మెంట్ వదిలేసి వెళ్లిపోవాలంటూ ప్యారిస్ కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ బయటకు వచ్చింది. ఇంటి యజమానికి రెంట్ చెల్లించపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అందులో ఉంది. డిసెంబర్ 14న కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వివరాల కాపీని ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ బయటపెట్టింది.

సిరిల్లీ ఆక్సెన్ ఫాన్స్ అనే ఫ్రెంచ్ వ్యక్తిని పెళ్లాడిన మల్లిక ఆ తర్వాత ఫ్రాన్స్ లోనే కాపురం పెట్టింది. షెరావత్, ఆమె భర్త ఇంటి ఓనర్ కు రెంట్ రూపంలో 78,787 యూరోలను చెల్లించడమే కాక ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించినట్టు ఉంది. ఈ వార్తలపై మల్లిక గతంలో స్పందిస్తూ.. తనకు సొంత అపార్ట్ మెంట్ కానీ, రెంటెడ్ అపార్ట్ మెంట్ కానీ లేదని ట్వీట్ చేసింది. అలాంటప్పుడు తాను అపార్ట్ మెంట్ ను ఖాళీ చేసే ప్రశ్నే తలెత్తదని చెప్పింది. తనకు ప్యారిస్ లో అపార్ట్ మెంట్ ఉందని మీడియాలోని కొందరు భావిస్తున్నారని... అది నిజం కాదని తెలిపింది. ఎవరైనా తనకు అపార్ట్ మెంట్ ను డొనేట్ చేసి ఉన్నట్టైతే వారి అడ్రస్ ను పంపాలని సెటైర్ వేసింది.

కానీ, తీర్పు కాపీ ప్రకారం... 2017 జనవరి 1వ తేదీ నుంచి వీరిద్దరూ ప్యారిస్ లోని ఓ అపార్ట్ మెంట్ ను రెంట్ కు తీసుకున్నారు. నెలకు 6,054 యూరోల రెంట్ వీరు చెల్లించాల్సి ఉంది. అయితే వీరు కేవలం 2,715 యూరోలను మాత్రమే సింగిల్ టైమ్ లో చెల్లించారని, ఆ తర్వాత రెంట్ కట్టడం మానేశారంటూ అపార్ట్ మెంట్ ఓనర్ కోర్టుకెక్కాడు. నవంబర్ 14న కోర్టు విచారణ సమయంలో మల్లికా షెరావత్ తరపు లాయర్ వాదిస్తూ, ప్రస్తుతం వీరు ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో, ఓనర్ తరపు లాయర్ వాదిస్తూ వీరు రెంట్ కట్టలేకపోయినా, భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారని అన్నారు. అనంతరం, డిసెంబర్ 14న కోర్టు తుది తీర్పును వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles