Senior Actor says He was Not Treat Roja as Politician | బండ్ల పిచ్చోడు.. రోజా మాట్లాడిన పద్ధతి నచ్చలేదు

Kota srinivas rao comments on tollywood

Kota Srinivasa Rao, HMTV Interview, MLA Roja, Roja-Bandla Ganesh War, Kota Srinivas Rao on Tollywood, Kota on Jabardasth, Stars Legacy Kota Srinivas Rao

Actor Kota Srinivasa Rao Fires on Tollywood Stars Legacy & Jabardasth Show. And also responded on Roja-Bandla Ganesh Issue. and also said he was not consider Roja as Politician because of her language.

రోజాపై కోట శ్రీనివాస రావు అసంతృప్తి

Posted: 01/08/2018 07:09 PM IST
Kota srinivas rao comments on tollywood

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాతలు, దర్శకులు, నటులు ఇలా ప్రతీ ఒక్కరూ ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన వాపోయారు. టాలెంట్ మాట పక్కన పెట్టి వారసత్వానికే పెద్ద పీట వేస్తున్నారని.. ఎవరో నాని లాంటి ఒకరిద్దరూ సొంత టాలెంట్ తో పైకి వస్తున్నారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ కారణజన్ముడు కనుకనే ఆయన ఒక్కడికే అంతటి పేరు వచ్చిందని, అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి వాళ్ల కుటుంబంలో ఇంకెవరున్నారు? అని ప్రశ్నించారు. ఇక నటి, ఎమ్మెల్యే రోజా తీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మొహమాటంగా చెప్పాలంటే..రోజా గారిని పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను.. పట్టించుకోను అని ఆయన చెప్పారు.

ఆమె(రోజా)మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు. ఎందుకంటే, ఈ మధ్య టీవీలో..బండ్ల గణేశ్, ఆ అమ్మాయి (రోజా) పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు? ఏమన్నా అర్థముందా? పోనీ, వాడంటే (బండ్ల గణేశ్) ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. నీ (రోజా) కేంటీ.. నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది! అని కోట శ్రీనివాస రావు తెలిపారు. హెచ్ ఎం టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh