Star Hero Not Bothered Clash with Padmavat | పద్మావత్ పోటీ విడుదలపై అక్షయ్ స్పందన ఇది...

Akshay kumar on padmavat release

PadMan, Akshay Kumar, Padmavat, Release Date, Box Office Clash, Sanjay Leela Bhansali, CBFC Clearance, Deepika Padukone

There is a buzz that Sanjay Leela Bhansali's Padmavat may hit the theatres the same day as PadMan, but actor Akshay Kumar is hopeful that both the movies do well in the holiday weekend.Asked about his reaction on the possible clash of the two films, Akshay said, "It is not about competition, it is a very big day, a big week, so all the films can come. Both the films can release on that day."Every film has the right to release whenever they (makers) want, and I am happy for them," he told reporters.

పద్మావత్ పాడ్ మాన్ కు పోటీ కాదు : అక్షయ్ కుమార్

Posted: 01/08/2018 05:59 PM IST
Akshay kumar on padmavat release

పేరులో మార్పు, సెన్సార్ ప్యానెల్ చెప్పిన కట్స్ కు అంగీకరించటంతో సీబీఎఫ్ సీ నుంచి క్లియరెన్స్ తో ఎట్ట‌కేల‌కు సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వం వహించిన చిత్రం 'ప‌ద్మావ‌త్‌' గా మన ముందుకు రాబోతోంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో తమ ఇష్టం ఉన్నప్పుడు విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు తెలిపింది. దీంతో ఈ నెల చివర్లో చిత్రం విడుదల కాబోతుందంటూ ఓ వార్త బయలుదేరింది.

అయితే జ‌న‌వ‌రి 25న అక్ష‌య్ కుమార్ 'ప్యాడ్ మ్యాన్‌' చిత్రం కూడా విడుద‌లకాబోతోంది. దీంతో ప‌ద్మావ‌త్ సినిమా వ‌ల్ల ప్యాడ్ మ్యాన్ సినిమాకి న‌ష్టం తప్పదనే అంతా చర్చించుకుంటున్నారు. సామాజిక అంశమైన పాడ్ మాన్ కంటే వివాదాలతో కూడిన పద్మావత్ పైనే అందరి దృష్టి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విష‌యంపై మీడియా అక్ష‌య్ కుమార్ ను ఆరా తీయగా ఆయన త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ప‌ద్మావ‌త్ విడుద‌ల అవ‌బోతుండ‌టం నాకు ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఏ సినిమా ప్ర‌త్యేక‌త దానికి ఉంటుంది. సినీ నిర్మాత‌ల‌కు త‌మ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుద‌ల చేసుకునే హ‌క్కు ఉంటుంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య పోటీ వల్ల స‌మ‌స్య ఉంటుందని భావించటం లేదు అని అక్కీ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా విడుద‌ల తేదీ గురించి 'ప‌ద్మావ‌త్' చిత్ర బృందం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాకపోయినా.. కొన్ని మీడియా ఛానెళ్లు మాత్రం 25నే అంటూ తేదీని ప్రకటించేస్తున్నాయ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles