Rakul gets another Biggie in Tollywood | సినిమా రిలీజ్ కు ముందే బంపరాఫర్ కొట్టేసిన రకుల్

Rakul with bollywood star hero

Rakul Preet Singh. Akshay Kumar, Bollywood Offer, Aiyaary Movie, Sidharth Malhotra, Rakul Bollywood Movies

Rakul Preet Singh another biggie in Bollywood. She paired opposite Akshay kumar for Next Movie. Her Movie Aiyaary ready to release.

బాలీవుడ్ లో స్టార్ హీరో సరసన రకుల్

Posted: 01/08/2018 07:44 PM IST
Rakul with bollywood star hero

తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్, తెలుగులో ఆ స్థానాన్ని కాపాడుకుంటూనే తమిళ .. హిందీ భాషల్లో వరుస ఛాన్సులను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే తమిళంలో కార్తీతో ఒక సినిమా చేసిన రకుల్, తాజాగా సూర్య సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి మరో హీరోయిన్.

ఈ సినిమా తరువాత మళ్లీ ఆమె కార్తీ జోడీ కడుతుండటం విశేషం. ఇక హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా అయ్యారీ సినిమాలో నటిస్తోంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగానే మరో స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం కైవసం చేసుకుంది.

ఆమె అక్షయ్ కుమార్ తదుపరి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇంతకుముందు అసిన్ .. కాజల్ .. శ్రుతిహాసన్ .. తమన్నాలకు అవకాశం ఇచ్చిన అక్షయ్ కుమార్, తాజాగా రకుల్ కి ఛాన్స్ ఇవ్వడం విశేషం. మొత్తానికి మూడు భాషల్లో రకుల్ తన హవా చూపేందుకు యత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles