Vishal Get another Shock with Ponvannan Resign | విశాల్ గ్రూప్ నుంచి నటుడి అవుట్.. అంతర్గత కలహాలే కారణమా?

Actor ponvannan resign nadigar sangam

Actor Vishal, Actor Ponvannan, Nadigar Sangam, Nadigar Sangam Actor Vishal, Vishal Nadigar Sangam Jerk, Vishal Political Entry Troubles

Blow to Vishal as his close aide Ponvannan resigns from Nadigar Sangam. But Sources say that Ponvannan resigned his post only because he is unhappy with Vishal’s move to contest at RK Nagar by-election without consulting with anyone in Nadigar Sangam.

నడిఘర్ సంఘానికి నటుడి రాజీనామా.. విశాల్ కి ట్రబుల్

Posted: 12/11/2017 04:04 PM IST
Actor ponvannan resign nadigar sangam

విశాల్ రాజకీయ ఆరంగ్రేటం కొత్త తలనొప్పులను తెచ్చి పెడుతోంది. ఈ మధ్యే నిర్మాతల మండలి నుంచి నిష్క్రమించాలన్న డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సీనియర్ నటుడు కమ్ దర్శకుడు టీ రాజేందర్ విశాల్ రాజీనామాకు పట్టు బట్టగా.. దర్శకుడు చెరన్ మరికొందరు ఆ డిమాండ్ కు స్వరం పలికారు. ఇక ఇప్పుడు సొంత వర్గం నుంచి అతనికి ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నడిగర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పదవికి తమిళ నటుడు పొన్ వన్నన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కమెడియన్ కరుణస్ కు.. పొన్ వన్నన్ కు ఈ పదవి విషయంలో అప్పట్లో చిన్న గొడవ జరగ్గా, విశాల్ కరుణాస్ వైపే మొగ్గు చూపగా.. మిగతా సభ్యుల ఒత్తిడితో పొన్ వన్నన్ కు అది దక్కింది. తాజా పరిస్థితుల్లో విశాల్ ను ఇరకాటంలో పెట్టేందుకు అవతలి గ్రూప్ వెనకాల ఉండి ఈ డ్రామాను నడిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగి, రాజకీయరంగంలోకి అడుగుపెట్టాలని భావించిన హీరో విశాల్ కు అక్కడ నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. అతని నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత విశాల్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడానికే ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించానని... రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయ బరిలోకి దిగుతానని తెలిపాడు. ఇంతలోనే నడిగర్ సంఘంలో విబేధాలు బయటపడటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles