Richa Chadda U Turn on cating Couch | లైంగిక వేధింపులు అంది.. ఇప్పుడు తూచ్ అంటోంది

Richa chadda about molestation

Actress Richa Chadda, Casting Couch Bollywood, Richa Chadda Molestation, Richa Chadda Twitter

Actress Richa Chadda takes u turn on Casting couch remarks in bollywood. She intentionally mention that and says apology for that.

లైంగిక వేధింపులపై మాట మార్చిన రిచా చద్దా

Posted: 12/11/2017 04:43 PM IST
Richa chadda about molestation

కాస్టింగ్ కౌచ్ పై ఈ మధ్య వరుసగా హీరోయిన్లు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నటి రిచా చద్ధా కూడా తన చిత్రం ప్రమోషన్ కోసం ఇలాంటి వార్తలే చేసి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనతో పాటు, తన కొలీగ్స్ ఎంతో మంది లైంగిక వేధింపులకు గురయ్యారని, రక్షణ కల్పిస్తామన్న హామీ వస్తే, హార్వే వీన్ స్టెయిన్ ఘాతుకాల వంటివి ఎన్నో బయటకు వస్తాయని సంచలన కామెంట్స్ చేసింది.

దీంతో తన విషయంలో ఏం జరిగిందో చెప్పాలంటూ ఆమెపై ఒత్తిడి పెరిగింది. రిచా వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం అయ్యింది. ఆమెపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చుకుంది. "నాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు. 'నేను' అన్న పదాన్ని ఓ ఉదాహరణగా మాత్రమే ఇంటర్వ్యూలో వాడాను. ఇక ఈ అయోమయానికి స్వస్తి పలకండి. చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. అని పేర్కొంది.

దయచేసి నన్ను ఒంటరిగా విడవండి.. ఇలాంటి కామెంట్లు పొరపాటున చేశాను అని వివరణ ఇచ్చుకుంది. దీంతో పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles