Producer Suicide Financier escaped to Andaman | అశోక్ మృతి కేసులో అన్బు.. అండమాన్ కు ఎలా పరారయ్యాడు?

Anbu chezhiyan escaped in ashok case

Anbu Chezhiyan, Producer Ashok Kumar, Ashok Kumar Case, Ashok Kumar Anbu Chezhiyan, Ashok Kumar Death Case, Ashok Kumar Suicide

Kollywood Film Financier and distributor Anbu Chezhiyan escaped to Andaman Islands. Following the suicide of producer Ashok Kumar,

ఫైనాన్షియర్ అన్బు చెళియన్ ఎక్కడ?

Posted: 12/09/2017 07:01 PM IST
Anbu chezhiyan escaped in ashok case

కోలీవుడ్ నిర్మాత నిర్మాత అశోక్ కుమార్ కొన్ని రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నటుడు శశికుమార్ బావమరిది అయిన అశోక్.. ఫైనాన్షియర్ అన్బు చెళియన్ వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అతను లేఖ రాసి పెట్టి మరీ చనిపోయాడు. దీంతో అన్బు మీద తమిళ పరిశ్రమలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

విశాల్ లాంటి వాళ్లైతే అతడిపై కేసు కూడా నమోదు చేయాలని విమర్శించాడు. ఐతే అశోక్ ఆత్మహత్య చేసుకుని 18 రోజులు అవుతున్నా.. పోలీసులు ఇప్పటిదాకా అన్బును పట్టుకోలేకపోయారు. అతడి ఆచూకీ దొరకట్లేదు. అతను చెన్నైలోనే ఉండి ఉంటే ఈపాటికి కచ్చితంగా పోలీసులకు దొరికిపోయేవాడే. ఐతే అన్బు చెన్నైనే కాక తమిళనాడునే విడిచి వెళ్లిపోయాడని... అసలతను దేశంలోనే లేడని అంటున్నారు. ఐతే అన్బు ఫొటోను తమిళనాడులోని అన్ని విమానాశ్రయాలకూ పంపిన నేపథ్యంలో అతను సెక్యూరిటీని దాటి విదేశాలకు వెళ్లిపోయే అవకాశం లేదు.

ఈ విషయంలో అన్బు తెలివిగా వ్యవహరించాడని చెబుతున్నారు. చెన్నై ఓడరేవు నుంచి షిప్ ఎక్కి సముద్రం మీదుగా అండమాన్ కు చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్బు మేనేజరుతో పాటు వ్యక్తిగత సహచరుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే అన్బు ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles