Veteran actor Shashi Kapoor died at the age of 79 | దిగ్గజ నటుడు శశి కపూర్ కన్నుమూత

Actor shasi kapoor died

Shashi Kapoor, Shashi Kapoor Death News, Shashi Kapoor Dies, Shashi Kapoor News, Prithviraj Theatre Shashi Kapoor

Veteran actor Shashi Kapoor died today at the age of 79. Kapoor was unwell for quite some time. The actor was admitted to the Kokilaben Hospital in Mumbai. He was administered several rounds of dialysis while at the hospital. Shashi Kapoor is survived by two sons, Kunal and Karan, and a daughter, Sanjana, who takes care of the Prithviraj Theatre.

బాలీవుడ్ దిగ్గజ నటుడు శశికపూర్ కన్నుమూత

Posted: 12/04/2017 06:53 PM IST
Actor shasi kapoor died

దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ (79) ఇక‌లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శశి కపూర్ ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్లో ఇవాళ కన్నుమూశారు. 1938 మార్చి 18న కోల్‌క‌తాలో శ‌శిక‌పూర్ జ‌న్మించారు. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఆయ‌న రాణించారు. నాలుగు సంవత్సరాల పిన్న వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ తోపాటు ప్రయాణిస్తూ ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించాడు.

1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 1999 వ‌ర‌కు కొన‌సాగింది. సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండటంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1950లో వచ్చిన సంగ్రామ్ చిత్రంలో అశోక్ కుమార్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. 1948-54 మధ్యలో నాలుగు హిందీ చిత్రాలలో నటించాడు.

2010లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాప‌ల్య పుర‌స్కారం, 2011లో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు, 2015లో దాదాసాహెబ్ పాల్కే పుర‌స్కారం ల‌భించాయి. శశికపూర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన చివరి చిత్రం సైడ్‌ స్ట్రీట్స్‌ (1999). మొత్తం 61 సినిమాల్లో ఆయ‌న పూర్తిస్థాయి హీరోగా న‌టించారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. శశి కపూర్ మరణంపై యావత్ బాలీవుడ్ పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Kapoor  Death News  శశికపూర్  మరణ వార్త  

Other Articles