Nata Kiriti Reacted on Vulgar Comedy in Present Trend | బూతు కామెడీపై నట కిరీటీ ఆవేదన

Rajendra prasad on vulgar comedy

Rajendra Prasad, Tollywood Vulgar Comedy, Rajendra Prasad Vulgar Comedy, Rajendra Prasad Tirupati Visit, Rajandra Prasad Jabardasth Comedy

Rajendra Prasad Express his disappointment on Vulgar Comedy. Recently He visited Tirupati and Talk to media about double meaning comedy.

కుళ్లు కామెడీపై రాజేంద్ర ప్రసాద్ ఆవేదన

Posted: 12/04/2017 06:41 PM IST
Rajendra prasad on vulgar comedy

హస్య చిత్రాలతో 80, 90 వ దశకాలలో తెలుగు ప్రేక్షకులను ఇంటిల్లిపాదిని మెప్పించి నట కిరీటిగా పేరుగాంచిన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయిన ఆయన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కామెడీ పేరుతో కుళ్లు కామెడీని పంచుతున్న కొన్ని టీవీ షోలపై, అందులోని నటుల పేర్లను ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇలాంటి కామెడీ గురించి చాలా మంది నా దగ్గర ప్రస్తావించారు. ఇప్పుడున్న మేకర్లు వల్గారిటీనే కామెడీ అనుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు సినిమాలు నైతిక విలువలు, ఏదో ఒక సందేశంతో తెరకెక్కేవి. అందుకు వాటిని ఇప్పుడు టీవీల్లో ప్రసారం చేసినా ఆదరిస్తారు. కానీ, ఇప్పుడొచ్చే సినిమాలు విలువల మాటేమోగానీ.. పూర్తిగా భష్టు పట్టించేస్తున్నాయి. కామెడీ పేరిట కుళ్లు జోకులు పేల్చటం బుల్లితెరపైనా అలవాటు అయిపోయింది. అలాంటి వాళ్లు ఇదే కామెడీ కాదని గుర్తుంచుకోవాలి అని చెప్పుకొచ్చారు. మీడియాతోపాటు అలాంటి కామెడీ చేసే వారికి తాను రిక్వెస్ట్ చేస్తున్నానని, పిల్లలు సైతం చూసే కామెడీని క్రియేట్ చెయ్యడంటూ మేకర్లకు, కమెడియన్లకు ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles