Samantha Selects Gollabhama Saree for Ivanka | ఇవాంక కోసం శారీ రెడీ.. ఇంతకీ శామ్ కలుస్తుందా? లేదా?

Samantha select saree for ivanka

Samantha Akkineni, Ivanka Trump, Ivanka Hyderabad Tour, Ivanka GES 2017, Ivanka Handloom Saree, Ivanka Samantha, Ivanka Gollabhama Handloom Saree

Telangana Handlomm Brand Ambassador, Actress Samantha Akkineni Selects Gollabhama Handloom Saree for Ivanka Trump who was in Hyderabad tour for GES.

ఇవాంక కోసం చీర సెలక్ట్ చేసిన సమంత

Posted: 11/28/2017 10:54 AM IST
Samantha select saree for ivanka

తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న నటి సమంత అక్కినేనికి సర్కార్ మరో కీలక బాధ్యతలను అప్పజెప్పింది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఇవాంక ట్రంప్ కోసం చీర సెలక్ట్ చేసే పనిని సమంతనే చూసుకుంటుందంట.

చేనేత అంబాసిడర్ గా నియమింపబడ్డాక సమంత చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పలు చోట్ల తిరిగి మగ్గాలు, చీరలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన బాధ్యతలను కూడా సమంతకే అప్పగించారు. 50 ఏళ్ల చరిత్ర, పైగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ లో హక్కులను దక్కించుకున్న సిద్ధిపేట గొల్లభామ చీరను ఇవాంకకు బహుకరించేందుకు సిద్ధమైపోయారు.

తిరిగి అమెరికాకు బయలుదేరే సమయంలో ఇవాంకకు దీనిని బహుకరించబోతున్నారు. అయితే ఇది సమంతే స్వయంగా అందజేస్తుందా? లేక అధికారులా అన్నది మాత్రం ఇంకా తేలలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh