Bommarillu Bhaskar’s career Not Finished Yet | బొమ్మరిల్లు దర్శకుడి పని అయిపోలేదు.. మెగా హీరోతో ఛాన్స్!

Bommarillu director next project confirm

Bommarillu Bhaskar, Allu Sirish, Geetha Arts Banner, Bommarillu Bhaskar Allu Sirish, Allu Sirish Next Movie, Bommarillu Bhaskar Allu Aravind

Mega producer to revive Bommarillu Bhaskar’s career. Bhaskar is now looking for a comeback with a film to be bankrolled by Mega producer Allu Aravind on his Geetha Arts Banner. It is learnt that Bhaskar has convinced Aravind with an interesting script and Allu Sirish is likely to play the lead role in this project.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బొమ్మరిల్లు దర్శకుడు

Posted: 11/28/2017 10:13 AM IST
Bommarillu director next project confirm

బొమ్మరిల్లు లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దర్శకుడు భాస్కర్ తర్వాత కెరీర్ అంతా వరుస ఫ్లాపులతోనే సాగింది. 11 ఏళ్ల కెరీర్ లో కేవలం 5 అంటే ఐదే చిత్రాలు తీసిన ఈ డైరెక్టర్ పరుగు తర్వాత ఆరెంజ్, ఒంగోలుగిత్త, బెంగళూర్ నాట్కల్(తమిళ్) వరుస డిజాస్టర్లు చవిచూడటంతో అతని పని అయిపోయినట్లేనని అంతా అనుకున్నార

అయితే అనూహ్యంగా వెంకీ-విజయదేవరకొండ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తెచ్చి అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు చాలా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డాడీ డైరెక్టర్. అయితే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రోత్సహాంతో మరో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే అల్లు శిరీశ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ కథగా ఇది తెరకెక్కబోతుందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఆ దర్శకుడికి కమ్ బ్యాక్ అవుతుందా? లేక సీనియర్ల మాదిరిగా బెడిసి కొడుతుందా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles