Gopichand on Movies Release Delay | సినిమాలు చేయటం వరకే నా బాధ్యత.. రిలీజ్ డేట్ నా చేతుల్లో లేదు!

Gopichand about failures

Hero Gopichand, Gopichand Oxygen Interview, Oxygen Movie Interview, Oxygen Movie Story

Hero Gopi Chand Oxygen Movie Interview. Gopi Chand says Movie Releases Not in His Hands.

ఫెయిల్యూర్స్ గురించి హీరో గోపిచంద్

Posted: 11/28/2017 11:25 AM IST
Gopichand about failures

తక్కువ టైంలో మ్యాన్లీ స్టార్ గా మాస్ లో ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న హీరో గోపీచంద్ ఇప్పుడు హిట్ కోసం తెగ తాపత్రయపడుతున్నాడు. లౌక్యం తర్వాత మినిమమ్ హిట్ కూడా లేకుండా పోయాడు.

అయితే తాను కెరీర్ లో తప్పటడుగు వేసిన మాట వాస్తవమేనన్న గోపీ.. బౌన్స్ బ్యాక్ కావటం మాత్రం ఖాయమంటున్నాడు. ఆరడుగుల బుల్లెట్ ప్రాజెక్టు చిత్రం ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడు పోయిందో? తెలీదుగానీ.. ఇప్పుడు ఆక్సిజన్ ప్రచారంలో మాత్రం పాల్గొంటున్నాడు.

హెవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రం తప్పకుండా అలరించి తీరుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘డైరెక్టర్లు చెప్పినట్లు యాక్ట్ చేయటం.. షూటింగ్ అయిపోయాక వచ్చేయటం ఇది మాత్రం నా చేతుల్లో ఉంటుంది. అంతేకానీ చిత్రం విడుదల తో ఎలాంటి సంబంధం ఉండదు’’ అని గోపీ తెలిపాడు. ఇకపై స్ట్రిప్ట్ ల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. నచ్చకపోతే చేయనని నేరుగా చెప్పి పంపించేస్తున్నానని తెలిపాడు. అలా ఈ మధ్యే ఓ రెండు చిత్రాల కథలను కూడా తిరస్కరించాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles