నారా రోహిత్, రెజీనా కాంబోలో రాబోతున్న బాలకృష్ణుడు చిత్రం ట్రైలర్ ఆ మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. అది బయటికొచ్చాక అందులోని ఓ సన్నివేశం గురించి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పెడార్థాలతో హెడ్డింగ్ లు పెట్టి పోస్టులు చేశాయి. దీనిపై నారా హీరో ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించాడు.
అది కమర్షియల్ ఫైట్ లో భాగంగా తీసిన సన్నివేశం. అనుకోకుండా జరిగిన ఘటన. అలాంటిదానికి కామెంట్ చేయాల్సిన అవసరం లేదని అని రోహిత్ ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో తెలిపారు. సెకన్ తక్కువ నిడివి ఉన్న ఆ దృశ్యాన్నే హైలెట్ చెయ్యటం సరికాదన్న ఆయన.. పట్టించుకోమన్న రీతిలో సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలను ఆయన ఖండించారు. వరుస చిత్రాలు చేసినంత మాత్రాన ఇలా అఫైర్లు అంటగట్టడం సరికాదని రోహిత్ మీడియాకు సూచించాడు.
ఇక ఇదే అదనుగా సందులో సడేమియా అంటూ ఓ ఛానెల్ వాళ్లు వీడియోను రిపీట్ మోడ్ లో పెట్టి ప్లే చేయటం.. ఇంకొన్ని ఛానెళ్లు అయితే ఆ సీన్ నే థంబ్ నెయిల్ గా(వీడియో ముఖ్యచిత్రంగా) పోస్టు చేసి ఆనందించటం చూడొచ్చు.ఈ మధ్యే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వాటికి అడ్డుకట్ట వేయాలని హెచ్చరించినా కొందరు పట్టించుకోకపోవటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more