Forbes World's Highest Paid Models 2017 List Out | ఏడాదిలో డబుల్.. ఈ మోడల్ ఎంత సంపాదించిదో తెలిస్తే షాకవుతారు

Forbes 2017 world s highest paid models

Kendall Jenner, Forbes Magazine 2017, Forbes Magazine, world's Highest Paid Model, Kendall Jenner Earnings, Kendall Jenner 2017, Kendall Jenner Forbes List, Forbes Model List 2017

Kendall Jenner is the world's highest paid model. Kendall Jenner has been named the world's highest paid model by Forbes Magazine, earning $22m (£16.6m) in 2017. Jenner, who is part of the Kardashian family, beat Chrissy Teigen, Adriana Lima and Gigi Hadid to the top spot.

ఫోర్భ్స్‌ టాప్‌ 10 సంపన్న మోడళ్లు

Posted: 11/22/2017 03:50 PM IST
Forbes 2017 world s highest paid models

హాలీవుడ్ మోడల్ కెందల్ల్ జెన్నర్ మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక సంపాదనతో ఈ ఏడాది మోడళ్లలో అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు ఫోర్భ్స్ విడుదల చేసిన జాబితాలో 22 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించినట్లు తెలుస్తోంది.

22 ఏళ్ల కెండ‌ల్ జూన్, 2016 - జూన్, 2017 మ‌ధ్య కాలంలో ఈ సంపాదనను వెనకేసుకుంది. ఎస్టీ లాడ‌ర్‌, అడిడాస్ వంటి సంస్థ‌ల‌కు మోడలింగ్ చేయ‌డంతో పాటు, త‌న సోద‌రి కైలీ జెన్న‌ర్‌తో క‌లిసి చేస్తున్న టీవీ షోల ద్వారా ఆమె పెద్ద‌ మొత్తంలో ఆర్జించించారు. అలెగ్జాండర్ వాంగ్, ఫెండి, ఛానెల్, మార్క్ జాకోబ్స్ తదితరులకు ఆమె ర్యాంప్ వాక్ చేశారు. కర్దాషియన్(కిమ్ తదతరులు..) కుటుంబానికి చెందిన కెందల్ల్, జిసెల్ బుండ్‌చెన్ క్రిస్సీ టైజెన్, అడ్రియానా లిమా, గిగీ హదిద్ లను వెనక్కి నెట్టేసింది.

ఈ జాబితాలో గత 15 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉన్న జిసెల్ 17.5 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానానికి పడిపోయింది. క్రిస్సీ టైజ‌న్ (13.5 మిలియ‌న్ డాల‌ర్లు)తో మూడో స్థానంలో నిలిచింది. ఇక కెందల్ల్ గతేడాది 10 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించగా.. ఈ యేడాది అది రెట్టింపు కావటం గమనార్హం.కాగా, ఈ ఏడాది టాప్ 10లో ఉన్న మోడ‌ళ్ల సంపాదన మొత్తం కలిపి 109.5 మిలియ‌న్ డాల‌ర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh