Mahesh's 27th Movie Project With Mass Director | మహేష్ బాబు.. ఆ మాస్ డైరెక్టర్ లలో ఎవరితోనో?

Mahesh 27th movie details

Mahesh Babu, Mahesh Babu VV Vinayak, Mahesh Babu 27th Movie, Mahesh Babu Boyapati Movie, Mahesh Boyapati, Mahesh with mass Director

Mahesh Babu Now Committed Serial Movies with Top Range Directors. VV Vinayak Mahesh Babu Movie Almost Completed.

మహేష్ 27.. వినాయక్ లేదా బోయపాటి?

Posted: 11/22/2017 05:45 PM IST
Mahesh 27th movie details

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నా పంథా మాత్రం మార్చుకోవటం లేదు. ప్రస్తుతం కొరటాలతో 'భరత్ అనే నేను' చేస్తోన్న మహేశ్ బాబు, ఆ తరువాత తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో ఫిక్స్ చేసుకున్నాడు. ఇక 26వ సినిమాను త్రివిక్రమ్ తో సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ లిస్ట్ లో ఇప్పడు మరో దర్శకుడు కూడా వచ్చి చేరాడంట. వినాయక్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఓ పూర్తి స్థాయి మాస్ కథతో తన దగ్గరికి రావాలని ఇప్పటికే మహేష్ పురమాయించాడంట. దీంతో అదుర్స్ 2 ప్రాజెక్టును పక్కకు పెట్టి మరీ మహేష్ కోసం కథ సిద్దం చేసే పనిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు బోయపాటి కూడా మహేశ్ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన్న 27వ చిత్రం మాత్రం ఊర మాస్ డైరెక్టర్లలో ఎవరితో ఒకరితోనో ఉండబోతుందని ఖాయమైంది.

ప్రస్తుతం వినాయక్ సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. కామెడీ ఫ్లస్ ఎమోషనల్ అంశాలతో సాయిని పూర్తి స్థాయి మాస్ హీరోగా చూపించబోతున్నాడంట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh