Garuda Vega beats RGG-2 and VOZ in USA | రాజశేఖర్ దెబ్బకి ఆ ఇద్దరూ అవుట్.. మిగిలింది మాస్ రాజానే!

Psv garuda vega overseas collections

Rajasekhar, PSV Garuda Vega Collections, PSV Garuda Vega US Collections, Garuda Vega Overseas Collections, Garuda Vega RG2 VOZ, Garuda Vega Raja The Great

Rajasekhar's PSV Garuda Vega box office collection day 6. Rajasekhar's film beats RGG-2 and VOZ in US.Now Targets Raviteja's Raja The Great Movie.

ఓవర్సీస్ లో ‘గరుడ వేగ’ వీరవిహారం

Posted: 11/11/2017 12:55 PM IST
Psv garuda vega overseas collections

సీనియర్ హీరో రాజశేఖర్ గరుడ వేగ .. విడుదల రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు తక్కువ స్క్రీన్ల మూలంగా డల్ కలెక్షన్లు వచ్చినప్పటికీ.. రెండవ రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. కొత్త సినిమాలు విడుదల కావటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల కాస్త తగ్గినప్పటికీ... 5 రోజుల్లోనే 15 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ పెంచడం ఓ విశేషమైతే, అక్కడ 'రాజుగారి గది 2' .. 'ఉన్నది ఒకటే జిందగీ' వసూళ్లను ఈ సినిమా అధిగమించడం మరో విశేషం. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా, 'రాజా ది గ్రేట్' వసూళ్లకు దగ్గరలో వుంది. ఈ వసూళ్లను కూడా 'గరుడ వేగ' క్రాస్ చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.

చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన 'గరుడ వేగ' .. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుపోతుండటం పట్ల ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకుంటున్న రాజశేఖర్.. విడుదలకు ముందు హార్ట్ ఎటాక్ కూడా వచ్చిందంటూ మరో బాంబు పేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles