Tollywood Singer Radhika Passes Away | బావలు సయ్యా సాంగ్ రియల్ సింగర్ రాధిక కన్నుమూత.. ఎలా చనిపోయిందో తెలుసా?

Singer radhika passes away

Singer Radhika, Bavalu Sayya Singer, Bavalu Sayya Song, Telugu Item Songs Singer DIed, SInger Radhika Passes Away

Singer Radhika Died with Heart Attack. Bavalu Sayya Fame Radhika Later sung few songs in Tollywood. Later she good bye to singing now reside along with family in Chennai.

సింగర్ రాధిక కన్నుమూత

Posted: 11/11/2017 12:38 PM IST
Singer radhika passes away

ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూశారు. 47 ఏళ్ల రాధిక గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. బావ బామర్ది చిత్రంలోని ‘బావలు సయ్యా.. హే మరదలు సయ్యా...’ పాటతో ఆమె బాగా పాపులర్ అయ్యారు.

తిరుపతిలో జన్మించిన ఈ గాయని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. బావలు సయ్యా సాంగ్ బిగ్ హిట్ అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. నరసింహానాయుడలో చిలకపచ్చ కోకా.. అన్నయ్య చిత్రంలో ఆట కావాలా పాటకావాల.. లాంటి కొన్ని పాటలు ఆమె పాడారు. 2004 నుంచి సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆమె మధ్య మధ్యలో స్టేజీ షోలు నిర్వహించారు.

ప్రస్తుతం ఆమె చెన్నై పాలవాక్కంలో నివసిస్తున్నారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలిపారు. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 47ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆమె మరణించటం పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles