Prabhas Hollywood Observation for Saaho Stunts | హాలీవుడ్ లో సాహోకి ఏం పని?

Prabhas in hollywood for saaho

Prabhas, Saaho Movie, Saaho Hollywood, Prabhas Hollywood Saaho Unit Hollywood, Saaho Team, Saaho Dubai Fights, Shradda Kapoor, Director Sujeeth

Prabhas's Saaho Movie Unit in Hollywood. Prabhas Observe Action Stunts for Body Language.

సాహో కోసం ప్రభాస్ హాలీవుడ్ ట్రైనింగ్

Posted: 11/11/2017 11:28 AM IST
Prabhas in hollywood for saaho

బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ కష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాహో చిత్రం కోసం వర్కవుట్, శిక్షణలు తీసుకోవటం తప్పటం లేదు. ప్రస్తుతం దుబాయ్ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే అక్కడి టీంలో ప్రభాస్ మాత్రం లేడు.

ప్రస్తుతం ప్రభాస్ హాలీవుడ్ లో ఉన్నాడు. అక్కడ అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ ల నిపుణుల పర్యవేక్షలో మూడు వారాలపాటు శిక్షణ తీసుకోనున్నాడంట. వారిని దగ్గరి నుంచి గమనించి బాడీ లాంగ్వేజ్ ను వంటబట్టిచ్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. సాహో చిత్రానికి ఆంగ్ల చిత్రాల ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ స్టంట్లు సమాకూరుస్తున్న విషయం తెలిసిందే. ఆయన సలహా మేరకు ప్రభాస్ ఇప్పుడు హాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాడన్న మాట.

అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక తిరిగి బూర్జ్ ఖలీఫా(దుబాయ్) కు చేరుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles