PK 25 First Track Release Date Fixed | పీకే 25.. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ బోనస్

Pk 25 first song release date details

Pawan Kalyan, PSPK25, PSPK25 Songs, PSPK25 Audio, Trivikram, Bayatakochi Chuste, Anirudh Ravichander

Pawan Kalyan-Trivikram Movie First Song Release Date Fixed. On Occasion of Trivikram Birthday Bayatakochi Chuste Full Song Released.

పీకే 25.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్

Posted: 11/04/2017 04:33 PM IST
Pk 25 first song release date details

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. పవర్ స్టార్ 25వ చిత్రం పాటల విడుదలపై ఓ స్పష్టత వచ్చేసింది. మొదటి పాటను నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

తద్వారా సినిమా ప్రమోషన్ ను ప్రారంభించాలని నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. గతంలో చిన్న బిట్ రూపకంలో వెలువడిన బైటికొచ్చి చూస్తే.. ఫుల్ సాంగ్ రాబోతుందంట. నిజానికి ముందు టైటిల్ పోస్టర్ తో ఓ మోషన్ పోస్టర్ వదలాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఇప్పుడు బోనస్ గా పాటను కూడా విడుదల చేయబోతున్నారంట.

ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా పాటలు విడుదల కానున్నాయి. కోలీవుడ్ యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.మొత్తం పాటలు పూర్తి చేసినట్లు అనిరుధ్ వెల్లడించాడు కూడా. పవన్ సరసన కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి.. జనవరి 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles