Siddarth Horror Thriller Gets Hit Talk | ఎట్టకేలకు సిద్దూ హిట్ కొట్టాడు

Aval gets positive talk

Siddharth, Aval movie review, Aval Movie, Aval Movie Hit, Siddharth Latest Movie, Siddharth Gruham Movie, Gruham Movie

Aval Movie gets Hit Talk in Tamil and Hindi both. Siddharth film has its flaws, but it’s devilishly frightening directed by Milind Rau.

సిద్దార్థ్ సినిమాకు హిట్ టాక్

Posted: 11/04/2017 04:03 PM IST
Aval gets positive talk

బాయ్స్ తో హీరోగా కెరీర్ ను ప్రారంభించిన నటుడు సిద్ధార్థ్ ఆ తర్వాత హీరోగా ప్రమోట్ అయ్యింది మాత్రం తెలుగు సినిమాలతోనే. అయితే ఎందుకో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన సిద్ధూ తర్వాత కోలీవుడ్ చిత్రాల మీదే ఫుల్ గా దృష్టిసారించాడు. కానీ, ఇన్నేళ్లలో ఒక్క జిగరతండా తప్ప తమిళ్ లో అతని చిత్రాలేవీ మినిమమ్ కూడా ఆడలేకపోయాయి.

అయితే చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అవల్ పేరుతో తీసిన ఆ హర్రర్ కామెడీ తమిళ్ అండ్ హిందీలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సిద్ధార్థ్, ఆండ్రియా, అతుల్ కులకర్ణి లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ జనాలకు బాగానే ఎక్కేసింది. మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఇండియాలో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోవటం ఖాయమని అంటున్నారు.

కొన్ని కారణాల వలన తెలుగులో రిలీజ్ నుచ వచ్చే వారానికి (నవంబర్ 10) వాయిదా వేశాడు. గృహం పేరుతో ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. మొత్తానికి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సిద్ధూకి ఎట్టకేలకు హిట్ లభించినట్లవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles