Kamal Haasan should be shot dead or Hanged | కమల్ కి బతికే హక్కు లేదు.. కాల్చి చంపండి లేదా ఉరి తీయండి

Hindu wing fire on kamal haasan

Kamal Haasan, Hindu Terrorism, Ashok Sharma, Akhil Bharatiya Hindu Mahasabha, Kamal Hang Shot Dead, Kamal Haasan Controversy, Kamal Hindu Terrorism Article

Hindu Mahasabha incites people to shoot Kamal Haasan dead. Kamal Haasan should be shot dead for Hindu terror remarks Akhil Bharatiya Hindu Mahasabha leader Pt. Ashok Sharma Said in a statement.

కమల్ కి బతికే హక్కు లేదు!

Posted: 11/04/2017 05:02 PM IST
Hindu wing fire on kamal haasan

హిందూ ఉగ్రవాదం పేరిట హిందూ సంఘాలపై ఉళగన్ నాయకన్(లోకనాయకుడు) కమల్ హాసన్ రాసిన వ్యాసం తీవ్ర దుమారం రేపుతోంది. వాటిని అణిచి వేయటంలో ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయని మండిపడ్డాడు. అంటే వెంటనే రంగంలోకి దిగిన నేతలు కమల్ పై ఫైర్ అవుతున్నారు.

అఖిల భారతీయ హిందూ మహాసభ నేత ఒకరు కమల్ ను కాల్చి చంపేయాలని వ్యాఖ్యానించారు. ‘‘కమల్ లాంటి వాళ్లను నియంత్రించటం చాలా కష్టం. అలాంటి వాళ్లను కాల్చి చంపటం లేదా ఉరి తీయటమే ఉత్తమం’’ అని అశోక్ శర్మ అనే సీనియర్ నేత చెప్పారు.మతాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని.. కమల్ కు బతికే హక్కు లేదని ఆయన అన్నారు.

అంతేకాదు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు(కూతురు శృతీహాసన్, అక్షర) తదితరుల చిత్రాలను బహిష్కరించాలని అశోక్ శర్మ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలకు మద్దతు చెప్పే వారికి కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. కాగా, కమల్ వ్యాసం పై ఆయనపై వారణాసిలో కేసు నమోదు కాగా, ప్రకాశ్ రాజ్, రమేష్ అరవింద్ లు కమల్ కు మద్దతుగా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles