ఒక దర్శకుడు ఒక హీరోయిన్ ను పదే పదే తీసుకోవటం అంటే మాములు విషయం కాదు. పరమ రోటీన్ అంటూ చూసే జనాలు కూడా మొహం ఒత్తే అవకాశాలు ఉంటాయి. కానీ, బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మాత్రం అలా కాదు.
తన తదుపరి చిత్రంలోనూ దీపికా పదుకునే ను తీసేసుకున్నాడు. గోలియోంకా రామ్ లీల, బాజీ రావ్ మస్తానీ, పద్మావతి హ్యాట్రిక్ గా ఆమెను తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత తీయబోయే ఓ లవ్ స్టోరీ కోసం కూడా ఆమెనే తీసేసుకున్నాడు. కవి సాహిర్ లూధియాన్వీ కవయిత్రి అమృతా ప్రీతమ్ ప్రేమగాథను బన్సాలీ తర్వాత తీయబోతున్నాడు. అమృతా రోల్ లో దీపికా, సాహిర్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారు.
1944లోనే ప్రీతమ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న అమృత, తర్వాత అనుకోకుండా కలిసిన సాహిర్‌తో ప్రేమలో పడింది. ఉత్తరాల ద్వారా కొంతకాలం వీరి ప్రేమకథ కొనసాగింది. అయితే ఒకరితో ఒకరు తమ ప్రేమ గురించి చెప్పుకోలేదు. తర్వాత 'రసిదీ టికెట్' పుస్తకంలో తాము రాసుకున్న ఉత్తరాల గురించి, సాహిర్ మీద తనకున్న ప్రేమ గురించి అమృతా ప్రీతమ్ ప్రస్తావించింది. సాహిర్ కూడా అతని తల్లితో అమృతాతో ప్రేమ విషయం గురించి మాట్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 1960లో ప్రీతమ్‌తో బంధాన్ని అమృత తెంచుకుంది. అలాగే సాహిర్ కూడా గాయని సుధా మల్హోత్రా ప్రేమలో పడటంతో అతనితో సంబంధానికి కూడా అమృత చెక్ పెట్టింది. తర్వాత చిత్రకారుడు ఇమ్రోజ్‌తో బంధాన్ని ఏర్పరుచుకుంది. ఈ ఇతివృత్తాలతోనే చిత్రం రూపుదిద్దుకోనుందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more