It's a baby girl for Actress Asin | అసిన్ ఇంట సందడి.. పాప పుట్టింది

Actress asin blessed with daughter

Actress Asin, Actress Asin Baby Girl, Actress Asin Husband, Actress Asin Rahul Sharma, Asin Rahul Sharma, Asin Baby, Actress Asin Couple, Asin Daughter Name

Actress Asin Thottumkal blessed with a baby girl. Ghajini actress Asin, husband Rahul Sharma(Micromax CEO) become parents. They Become Proud Parents Of A Baby Girl in a statemend they said.

నటి అసిన్ కు పాపా పుట్టింది

Posted: 10/25/2017 09:08 AM IST
Actress asin blessed with daughter

నటి అసిన్ ఇంట సందడి నెలకొంది. ఆమె పడ్డంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అసిన్-రాహుల్ దంపతులు స్వయంగా ప్రకటించారు. అమ్మనాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో సినిమాల్లో ఆరంగ్రేటం చేసిన ఆసిన్.. తర్వాత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కళ్యాణ్ ఇలా దాదాపు అందరు అగ్రహీరోలతో ఆమె నటించింది.కోలీవుడ్ లో విజయ్, సూర్య సరసన కూడా ఆమె అవకాశం దక్కించుకుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గజినీ’ సినిమా రీమేక్‌తో అసిన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆపై అక్షయ్ కుమార్ సరసన కూడా యాక్ట్ చేసింది. కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలోనే మైక్రోమ్యాక్స్ సీఈవో అయినరాహుల్ శర్మను పెళ్లి చేసుకుందీ కేరళ కుట్టి. క్రిస్టియన్ మరియు హిందూ పద్ధతిలో వీరి వివాహం జరగటం విశేషం. ఆపై సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి మళ్లీ ఇన్నాళ్లుకు ఇలా మంచి వార్తతో ముందుకు వచ్చింది. అన్నట్లు మరో రెండు రోజుల్లో(26 తేదీన) ఆమె 31వ వసంతంలోకి అడుగుపెడుతుంది.

ఇది తనకు ఇది గొప్ప బర్త్‌డే గిఫ్ట్ అని అసిన్ పేర్కొంది. గడిచిన తొమ్మిది నెలలు తమ జీవితంలో చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తమ వెంట నిలిచి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles