Pawan Kalyan Not interested in Mersal Remake | పవన్ ఆ చిత్రం చెయ్యట్లేదంతే...

Mersal not remake in telugu

Pawan Kalyan, Pawan Kalyan Mersal Remake, Pawan Mersal, Pawan Vijay Mersal, Pawan not Mersal Remake

Pawan Kalyan not in Mersal Remake. Already Pawan Close Aide Sharat Marrar plans to release Dubbed Version Adirindi in Telugu.

పవన్ మెర్సల్ రీమేక్ ఉత్తదే

Posted: 10/25/2017 09:31 AM IST
Mersal not remake in telugu

సాధారణంగా ఒక భాషలో బిగ్గెస్ట్ హిట్ అయిన చిత్ర రీమేక్ లపై మరో భాషలో కన్నుపడటం సహజం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూలా రీమేక్ లు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలు ఇక్కడ దించటం పవన్ కి అలవాటు. ఈ నేపథ్యంలో ఆయన విజయ్ తాజా చిత్రం 'మెర్సల్' కూడా తీయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

నిజానికి సినిమా ఒకేసారి తమిళ్, తెలుగు వర్షన్ లు రిలీజ్ కావాల్సి ఉంది. అదిరింది పేరుతో పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఇక్కడ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేశాడు. కానీ, చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలీదుగానీ అది వాయిదా పడింది. అయితే ఇంతలో ఓ టాక్ మొదలైంది. సినిమాలో రాజకీయ పరమైన అంశాల ప్రస్తావన ఉండటంతో, ఈ సినిమా రీమేక్ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నాడని ఓవార్త జోరుగా వినిపించింది.

కానీ, అసలు అలాంటి చర్చలు ఏం జరగలేదని మరార్ తన స్నేహితుల వద్ద ప్రస్తావించటంతో అదంతా ఉత్తదేనని తేలిపోయింది. మరోవైపు'మెర్సెల్' నిర్మాతలు కూడా రీమేక్ హక్కుల కోసం తమను ఎవరూ సంప్రదించలేదని స్పష్టత ఇవ్వటంతో పవన్ ఈ చిత్రం చెయ్యట్లదేన్న వార్త కన్ఫర్మ్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles