Pawan Kalyan Humble Request to His Fans in Twitter / అభిమానులకు, జన సేన కార్యకర్తలకు పవన్ రిక్వెస్ట్

Pawan kalyan teaches dignity to party workers

Pawan kalyan, Twitter, Fans, Janasena Party Workers, Criticism, Twitter Request, Maintain Dignity, Janasena Party Chief Pawan Kalyan

Pawan kalyan Tweet to fans about scolding Leaders. Presently he concentrate on party expansion. and Janasena Chief Requested Fans and Party Workers to Control Criticism and maintain dignity.

ట్విట్టర్ లో అభిమానులకు పవన్ రిక్వెస్ట్

Posted: 10/07/2017 04:30 PM IST
Pawan kalyan teaches dignity to party workers

అగ్ర నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు విజ్నప్తి చేస్తున్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం ఇప్పుడు తమ ముందు ఉన్న లక్ష్యం కేవలం పార్టీ విస్తరణే అని ఆయన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు.

అందులో ఉన్న సారాంశం ఏంటంటే... ‘‘జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. ప్రస్తుతం మనం పార్టీ అంతర్గత నిర్మాణంలో తలమునకలయ్యాం. మరోవైపు, ప్రజాసమస్యలే పరమావధిగా ముందుకు సాగుతున్నాం. ఈ తరుణంలో కొంత మంది వ్యక్తులు మన దృష్టిని మరల్చడానికో, మనల్ని చికాకు పరచడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివాటిపై ఎవరూ స్పందించవద్దని కోరుతున్నా. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా మాట్లాడినా... మీరూ మాత్రం హుందాగా వ్యవహరించండి. ఎందుకంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కోసం జనసేన ముందుకెళుతున్న సంగతి మీకు తెలిసిందే.

ఇది కూడా చదవండి... మంత్రులకు పవర్ కౌంటర్

కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనేది జనసేన నమ్మకం. దీన్ని ఆచరణలో చూపాలన్న అభిమతంతోనే జనసేన ఆవిర్భవించింది. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా జనసేన రూపుదిద్దుకుంటోంది. యువత, భావితరాలు, సమాజం, దేశ భవిష్యత్తుకు విశాలమైనటువంటి ధృక్పదం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన నమ్ముతోంది. ఇలాంటి నేపథ్యంలో, మనపై వచ్చే విమర్శలకు మీరు ఆవేశానికి లోను కాకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా... ఒక్కోసారి హాని కూడా తలపెడుతుంది.

మనపై చేస్తున్న ప్రతి విమర్శను కూడా పార్టీ లెక్కగడుతోంది. అవి హద్దులు మీరినప్పుడు పార్టీ స్పందిస్తుంది. మీరంతా పార్టీ కోసం హుందాగా పని చేయండి. మన ఓర్పే మన పార్టీకి రక్ష. జైహింద్" అని అందులో ఉంది. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రమే దృష్టి సారించాలన్నదే ఆయన ఉద్దేశ్యమని స్పష్టమౌతోంది. మంత్రులు పవన్ పై చేసిన వ్యాఖ్యలు-విమర్శలు, రేణూ దేశాయ్ పై ఫ్యాన్స్ వ్యాఖ్యలు.. ఈ నేపథ్యంలోనే పవన్ వారికి విజ్నప్తి చేసినట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles