Jiva Kee Movie Teaser Released and Review / ఏదో హాలీవుడ్ టీజర్ లాగా ఉందే...

Jiva new movie teaser out

Actor Jiva, KEE Movie, Teaser Release, KEE Teaser Review, Kee Movie Hollywood Copy, KEE Movie Person of Interest, Person of Interest Kollywood, Person of Interest Kalees, Person of Interest Jiva

Actor Jiva New Movie KEE Movie Teaser Released. Kee is an upcoming Indian Tamil science fiction psychological thriller film written and directed by Kalees. He may inspired it from Person of Interest Movie.

జీవా కీ చిత్రం టీజర్ రిలీజ్

Posted: 10/07/2017 04:11 PM IST
Jiva new movie teaser out

కోలీవుడ్ యువ హీరోల్లో జీవాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వెరైటీ వెరైటీ కాన్సెప్ట్ లతో ఎప్పటికప్పుడు పలకరిస్తుంటాడు. అయితే ఆయా చిత్రాలు అదే రీతిలో బోల్తా పడుతుంటాయి కూడా. రంగం తర్వాత సరైన సక్సెస్ లేకుండా పోయిన జీవాకు ఇప్పుడు హిట్ చాలా అవసరం. అందుకే డేర్ చేసి మరో డిఫరెంట్ జోనర్ మూవీతో వస్తున్నాడు.

అదే కీ చిత్రం. తాజాగా 2 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయగా... దానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఫోన్ హ్యాంకింగ్ కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. జీవా ఓ హ్యాకర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సరదా కోసం అందరి ఫోన్లను హ్యాక్ చేస్తుంటాడు హీరో. అయితే ఆ క్రమంలో కొందరి ప్రాణాలు పోతుండటంతో భయంతో అతను ఆ ప్రయత్నం మానుకుంటాడు. కానీ, అతనికి తెలీకుండానే మరో వ్యక్తి అదే పని చేస్తూ హత్యలు చేస్తుంటాడు. చివరకు ఆ సైకో విలన్ ఆటను హీరో ఎలా అడ్డుకుంటాడు అన్నదే చిత్ర కథగా తెలుస్తోంది.

 

కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హలీవుడ్ స్థాయి విజువల్ వర్క్ తోపాటు విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచాయి. అయితే పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చిత్రం నుంచి దర్శకుడు ప్రేరణ పొంది ఉంటాడేమో అనిపిస్తోంది. నిక్కీ గల్రానీ, అనైకా సోటి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మళయాళ నటుడు గోవింద్ పద్మ సూర్య విలన్ రోల్ పోషిస్తుండగా.. తెలుగు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ పాత్రలో నటించబోతున్నారు. ఈ యేడాది చివరల్లోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సైటింఫిక్ థ్రిల్లర్ తోనైనా జీవా హిట్ అందుకుంటాడా చూడాలి. ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KEE Movie  Actor Jiva  కీ చిత్రం  హీరో జీవా  

Other Articles