Manchu Lakshmi's Tattoo Meaning Revealed | మంచులక్ష్మీ టాటూకి అర్థం అదన్న మాట!

Manchu lakshmi s tattoo secret reveal

Manchu Lakshmi, Tattoo Story, Manchu Lakshmi Tattoo Secret, Manchu Lakshmi Tattoo Secret Reveal, Manchu Lakshmi New Tattoo, Persian Poet Rumi, Manchu Lakshmi Rumi

Manchu Lakshmi got inked a new tattoo on her right-side back shoulder which caught everyone's attention in the month of July when she attended Shyam Prasad Reddy daughter's wedding. Now the tattoo has been decoded as everyone got to read it properly through a picture of the actress shared recently on Instagram. "What you seek is seeking you". This line is penned by famous Persian poet Rumi. The meaning is understood- When you desire something, it means that there is something in you that makes you like that thing.

మంచు లక్ష్మీ టాటూ వెనుక అర్థం అదే!

Posted: 10/04/2017 01:02 PM IST
Manchu lakshmi s tattoo secret reveal

నటిగానే కాదు ఫ్యాషన్ ఐకాన్ గా కూడా ఈ మధ్య మంచు లక్ష్మీ ప్రసన్న ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. ఫోటో షూట్ లు, ర్యాంప్ వాక్ లు ఓ వైపు, మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ అంశంపై స్పందిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే ఆ మధ్య లక్ష్మీ భుజం మీద వేయించుకున్న ఓ టాటూ హాట్ టాపిక్ గా మారింది.

గత నెలలో ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురి పెళ్లికి హాజరైన లక్ష్మీ వేడుకలో తెగ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె కుడి భుజం కింద, వీపు మీద ఓ టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే టాటూ స్పష్టంగా కనిపించకపోవటంతో అసలు అదేంటీ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కోసం ఆమె ఉంచిన ఫోటోలు అదేంటో రివీల్ చేసేశాయి.

వాట్ యూ సీక్ ఈజ్ సీకింగ్ యూ.. అంటే నువ్వు ఒకదానిని కోరుకుంటే.. దానిని సాధించాలన్న పట్టుదల నీలో బలంగా ఉండటమే ఆ కోరికకు కారణం... అని అర్థం. ప్రముఖ పర్షియన్ రచయిత రుమీ రాసిన ఈ కొటేషన్ ను ఆమె పచ్చ బొట్టులా పొడిపించుకుందన్న మాట. మొత్తానికి సమంత, తాప్సీ, దీపికలా వ్యక్తులకు సంబంధించి కాకుండా ఇలా ఓ ఫేమస్ కోట్ తో లక్ష్మీ మరోసారి ఆకట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles