Saamy Sequel Loading with Full Action Scenes | విక్రమ్ సినిమా రెండు నెలల షూటింగ్ కేవలం అందుకోసమే...

Vikram saamy sequel on floor

Chiyaan Vikram, Saamy Sequel, Saamy Square Movie, Fight master Kanal Kannan, Keerthi Suresh, Trisha, Director Hari

Chiyaan Vikram joined the sets of his next Saamy Square in the direction of Hari. The movie is said to be a sequel for Saamy in which Vikram will be seen essaying the role of a cop. The movie is said to have huge dose of action episodes and two months have been completely allotted to shoot the action sequences. Fight master Kanal Kannan will compose the fights which are expected to be the major highlights.

ఫుల్లీ యాక్షన్ లోడెడ్ తో సామీ స్క్వేర్

Posted: 10/04/2017 02:02 PM IST
Vikram saamy sequel on floor

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కథలను మాత్రమే నమ్ముకునే విక్రమ్.. రాంగ్ ఛాయిస్ లతో గత కొంత కాలంగా బోల్తా పడుతూ వస్తున్నాడు. అయినా ఆయన సినిమాలకు మంచి బిజినెస్ అవుతూనే వస్తోంది. ఇక తెలుగులో అపరిచితుడు తర్వాత హిట్ లేనప్పటికీ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. త్వరలో ఆయన తనయుడిని కూడా ఆరంగ్రేటం చేయించేందుకు సిద్ధమవుతున్నాడు.

అందులకే అట్టర్ ఫ్లాప్ అయిన 10 ఎంద్రాకులమ్ లాంటి సినిమాను తెలుగులో 10 పేరుతో డబ్ చేసి మరీ వదులుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్ స్కెచ్ తోపాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సామి చిత్రానికి సీక్వెల్ రెడీ అయిపోయింది. హరి దర్శకత్వంలో విక్రమ్ నటించిన మొదటి పార్ట్ ఏ రేంజ్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. దానిని తెలుగులో బాలయ్య లక్ష్మీ నరసింహగా జయంత్ సీ పరాన్జీ తెరకెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్ రెడీ అయ్యిది. స్వామి స్క్వేర్ టైటిల్ ను రివీల్ చేయగా.. విక్రమ్ కు జోడీగా త్రిష, కీర్తి సురేశ్ లు నటించబోతున్నారు. ప్రభు, బాబీ సింహాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కేవలం యాక్షన్ పార్ట్ ను రెండు నెలల పాటు నిర్విరామంగా షూట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. స్టంట్ మాస్టర్ కణల్ కన్నన్ ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారంట. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. పిబ్రవరి చివరి కల్లా షూటింగ్ అయిపోగొట్టేసి ఏప్రిల్ లో సామి స్క్వేర్ ను రిలీజ్ చేసేందుకు దర్శకుడు హరి ఫ్లాన్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles