Pooja Hegde Turns Item Girl for Rangasthalam | పూజా ఐటెం గర్ల్ ఛాయిస్ ఎవరిదంటే..

Rangasthalam 1985 item girl selected

Pooja Hegde, Rangasthalam 1985 Movie , Item song, Ram Charan, Director Sukumar, Duvvada Jagganadham Movie, Samantha, Anasuya

Actress Pooja Hegde Almost Confirmed for Rangasthalam 1985 Item Song. Sukumar Select her according to her performance in DJ Movie.

రంగస్థలంలో పూజా ఐటెం సాంగ్

Posted: 10/04/2017 12:18 PM IST
Rangasthalam 1985 item girl selected

లెక్కల మాష్టార్ అయిన డైరెక్టర్ సుకుమార్ తన తర్వాతి చిత్రం కోసం ప్రయోగాలనే చేస్తున్నాడు. చెర్రీ లాంటి హీరోతో విలేజ్ బ్యాగ్రౌండ్ ఉన్న కథను ఎంచుకోవటం దగ్గరి నుంచి.. పైగా ఊర మాస్ రోల్ లో చెర్రీని చూపించటం దాకా అన్నీ చేసేస్తున్నాడు. ఇది చాలదన్నట్లు చిత్రంలోని కాస్టింగ్ విషయంలోనూ అదే రూట్ ఫాలో అవుతున్నాడు.

ఇప్పటికే చిత్రంలో హీరోయిన్ సమంతను కాగా, ఓ కీలక పాత్రలో యాంకర్ అనసూయను తీసేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో మెరుపు తీగ పూజా హెగ్డే రంగంలోకి దించబోతున్నాడని టాక్. ఈ చిత్రంలో ఐటెం నంబర్ కోసం సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఓ మాస్ బీట్ ను ఐటెం కోసం కంపోజ్ చేశాడంట. బేసిక్ గా మంచి డాన్సర్ అయిన చెర్రీతో పోటీగా స్టెప్పులేసే హీరోయిన్ల కోసం చాలా మంది పేర్లనే సుక్కూ పరిశీలించాడు. చివరకు పూజను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 

దీనికి తోడు ఆమె ఇటీవల నటించిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవటంతోపాటు.. చిత్రంలో బన్నీతో పోటీ పడి మరీ స్టెప్పులేసింది. ఈ కారణాలతోనే సుకుమార్ ఆమెను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకుని తండ్రి సైరా చిత్రం కోసం సమయం కేటాయించబోతున్నాడు చెర్రీ. వచ్చే ఏడాది సమ్మర్ లో రంగస్థలం 1985 ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles