RGV Confirmed Movie With His First Hero | పాతికేళ్ల తర్వాత.. అవే అంచనాలు పెట్టుకోవచ్చా?

Rgv about movie with nagarjuna

Ram Gopal Varma, Nagarjuna Akkineni, Shiva Combo, RGV Nag, Varma With Debut Hero, Nag Varma Action Film

Ram Gopal Varma Confirmed movie with Akkineni Nagarjuna. It's Like Action Film But Not Compare with Shiva He added.

28 ఏళ్ల తర్వాత నాగ్ తో వర్మ యాక్షన్

Posted: 10/04/2017 11:23 AM IST
Rgv about movie with nagarjuna

దర్శకుడు రాం గోపాల్ వర్మ మళ్లీ సోషల్ మీడియాలో మరో ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. మొన్నటి దాకా శశికళ, నయీం, ఎన్టీఆర్ బయోపిక్ లంటూ గోల చేసిన ఈ వివాదాల దర్శకుడు తన తొలి చిత్ర హీరో నాగార్జునతో సినిమా తీసేందుకు రెడీ అయిపోతున్నాడు. త్వరలో నాగ్ తో ఓ సినిమా ఉండబోతుందని.. యాక్షన్ మూవీనే అయినా అది శివలా మాత్రం అస్సలు ఉండబోదని ప్రకటించాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివ' అప్పట్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ సినిమా వచ్చి పాతికేళ్లకు పైగా అవుతుండగా, మళ్లీ ఇంతకాలానికి నాగార్జునతో చేయడానికి వర్మ సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఇది 'శివ' సినిమాకి సీక్వెల్ కాదు .. అంతకి మించిన డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని వర్మ అన్నాడు. వాస్తవానికి దగ్గరగా వుండే యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నాడు. ఇప్పుడు శివకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేసి వీ ఆర్ కంమింగ్ బ్యాక్ విత్ యాన్ యాక్షన్ ఫిల్మ్ అంటూ పోస్ట్ పెట్టాడు.

నాగ్ కూడా తాను వర్మతో సినిమాకు రెడీ అని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే వరుసగా సినిమాలను అనౌన్స్ చేసే వర్మ అందులో తెరకెక్కించినవి కొన్నే. పైగా వర్మ సినిమాల్లో ఏవీ హిట్ అవుతాయో.. ఏవి ఫట్ మంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆ లెక్కన్న 28 ఏళ్ల తర్వాత నాగ్ తో సినిమా తీయబోతున్న సినిమా ద్వారా వర్మ నుంచి ఎక్స్ ఫెక్టేషన్లు పెట్టుకోకపోవటమే మంచిదన్నది విశ్లేషకుల మాట. అన్నింటికి మించి దానిని వీలైనంత త్వరగా షూట్ చేస్తేనే మంచిదన్నది అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles