Kannada actor Rakesh Passes Away | అరుదైన వ్యాధితో యంగ్ హీరో ’బుల్లి‘ రాకేశ్ కన్నుమూత

Kannada actor died with illness

Kannada Actor, Rakesh, Bully Rakesh, Actor Rakesh Death News, Actor Rakesh Died, Gangrene

Kannada actor Rakesh of ‘Pappusi Comedy’ fame from Cheluvina Chittara movie has passed away on Monday evening in Bengaluru. He was 27 years old. Rakesh was reportedly suffering from gangrene and underwent surgery for the same two months back. He was admitted to St Johns hospital, where he breathed his last.

కన్నడ యువ హీరో హఠాన్మరణం

Posted: 10/04/2017 09:52 AM IST
Kannada actor died with illness

శాండల్ వుడ్ లో విషాదం చోటు చేసుకుంది. యువ హీరో రాకేశ్ (27) హఠాన్మరణంతో యావత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కి గురైంది. గత కొంత కాలంగా గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

చైల్డ్ ఆర్టిస్టుగా 'చెలువినచిత్తార'తో రంగ ప్రవేశం చేసిన రాకేశ్, పప్పుసీ కామెడీతో బాగా అలరించాడు. ఆపై హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. అభిమానులంతా అతన్ని 'బుల్లీ' అని ప్రేమతో పిలుచుకుంటారు. అయితే రాకేశ్ గత కొంతకాలంగా గ్యాంగ్రిన్ (రాచపుండు) వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రెండు నెలల క్రితం ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల వ్యాధి తిరిగి ముదరడంతో కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

పరిస్థితి విషమించి ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేశ్ లు కూడా నటులే. రాకేశ్ ప్రస్తుతం 'ధూమపాన' షూటింగ్ ముగింపు దశలో ఉంది. రాకేశ్ మృతి పట్ల శాండల్ వుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles