Golmaal Again Trailer Review | గోల్ మాల్ అగెయిన్... లాజిక్ లేదు.. మొత్తం మ్యాజికే!

Golmaal returns trailer out

Golmaal Again Trailer, Golmaal Again Trailer Review, Golmaal Again Movie, Golmaal Again Celebrities, Golmaal Again Movie Released Date

Golmaal Again Trailer Out. Ajay Devgn, Rohit Shetty Present the Same Old Wine, Horror Style. Ajay Devgn comedy has a ghost in it. Watch video. Golmaal Again Releasing 20th October directed by Rohit Shetty.

గోల్ మాల్ రిటర్న్స్ ట్రైలర్ రిలీజ్

Posted: 09/22/2017 05:47 PM IST
Golmaal returns trailer out

సిరీస్ సినిమాల్లో ఆల్ సక్సెస్ అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఏకంగా నాలుగు చిత్రాలను తెరకెక్కించాడు దర్శకుడు రోహిత్ శెట్టి మూడింటితో బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు . గోల్ మాస్ సిరీస్ లో రాబోతున్న గోల్ మాల్ 4 ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్లు.

అజయ్ దేవగన్, అండ్ కో ప్రధాన పాత్రలో గోల్ మాల్ 4 (గోల్ మాల్ రిటర్న్స్) దీపావళికి బాలీవుడ్ లో సందడి చేయనుంది. ఇత గత చిత్రాల మాదిరి కామెడీతోపాటు కాస్త హర్రర్ ఎలిమెంట్ ను కూడా ఈసారి జోడించాడు రోహిత్. యాక్షన్ సన్నివేశాలను యాజ్ యూజ్ వల్ గా తీశాడు. సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు హీరోయిన్లు పరిణితి చోప్రా, టబూలు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, నీల్‌ నితిన్‌ ముఖేశ్ కూడా ఓ కీలక పాత్రలో నటించటం విశేషం.

 

దెయ్యాల ఇంట్లో భయపడే హీరో అండ్ బ్యాచ్.. పారద్రొలటానికి వచ్చిన మంత్రగత్తెగా టబు.. ఏజ్ బార్ హీరో అయిన అజయ్ ను లవ్ చేసే అమ్మాయిగా పరిణితి.. వాళ్ల మధ్య సరదా సన్నివేశాలు ట్రైలర్ లో చూపించేశారు. కథ మీద పెద్దగా నమ్మకం లేకపోయినా ఎటోచ్చి ఎంటర్ టైన్ మెంట్ మీదే చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుందనిపిస్తోంది. అక్టోబర్ 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles