SPYder Producers Tension about Opening Collections | స్పైడర్ విషయంలో అసలు టెన్షన్ మొదలైందిగా...

Spyder opening collections

SPYder Movie, Spyder Opening Collections, Spyder First Day Collections, Spyder Movie Producers, SPYder Producers Tension

All Eyes on Mahesh Babu's SPYder Opeing Collections. Already Jai Lava Kusa got Positive Feed Back now less theaters problem to Mahesh Spy Thriller.

స్పైడర్ కి ఓపెనింగ్ వసూళ్లు కష్టమేనా?

Posted: 09/22/2017 04:50 PM IST
Spyder opening collections

దసరా బరిలో ఆసక్తికర పోటీకి తెరలేపిన చిత్రాల్లో జై లవ కుశ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అత్యధిక స్క్రీన్లలలో రీలీజ్ అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్ గా జై లవ కుశ నిలిచింది. అయితే ఓవరాల్ వసూళ్ల సంగతి తెలియాలంటే మాత్రం కొద్ది రోజలు ఆగాల్సిందే. ఇది టాలీవుడ్ లో ఇప్పుడు తర్వాతి కన్ను స్పైడర్ మీదే ఉంది.

స్పైడర్ వచ్చే నాటికి లవ కుశ థియేటర్లలో ఉంటుంది. పైగా కుటుంబ సమేతంగా చూసే చిత్రమని తేలటంతో దసరా సెలవులను ఉపయోగించుకునేందుకు కంపల్సరీ థియేటర్ల యాజమానులు ఈ చిత్రాన్ని ఆడించే అవకాశాలే ఉన్నాయి. దీనికి తోడు సైన్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన స్పైడర్ మాములు జనాలకు ఎక్కాలన్న కాస్త కష్టమే. ఇదిలా ఉంటే మరోవైపు థియేటర్ల సమస్య కూడా మహేష్ మూవీకే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్పైడర్ రిలీజ్ అయిన రెండు రోజులకే మహానుభావుడు థియేటర్లలో సందడి చేయనుంది. దాని కోసం ఇప్పటికే థియేటర్లు సిద్ధమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పైడర్ కు ఊహించిన సంఖ్యలో థియేటర్లు దొరకటం చాలా చాలా కష్టం. ఆ లెక్కన్న భారీ బడ్జెట్ తో రూపొందిన స్పైడర్ వసూళ్లు రాబట్టాలంటే భారీ ఓపెనింగ్సే కావాలి. తమిళంలో ఆ కొరత కొంత తీర్చినప్పటికీ.. తెలుగుతోనే అసలు సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే సినిమా లో బలమైన కంటెంట్ ముఖ్యంగా సెకండాఫ్ మూలంగా చిత్రం రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్యను పెంచుకుంటుందనే చిత్ర యూనిట్ భావిస్తోంది. చూద్దాం. ఏం జరుగబోతుందో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles