Nadir Shah Sick during questioning in Bhavana's Case Probe | భావన కేసు.. పోలీసుల దెబ్బకు స్పృహ కోల్పోయిన హీరో

Actor nadir shah faint during police investigation

Malayalam Actress, Abduction and Sexual Assault Case, Bhavana Case, Actor Nadirshah, Nadirshah Bhavana Case, Nadirshah Dileep Friendship

Malayalam actress assault case: Actor Nadirshah Again falls sick during the interrogation.

భావన కేేసులో నదిర్ షా విచారణ.. మళ్లీ పడిపోయాడు

Posted: 09/15/2017 06:50 PM IST
Actor nadir shah faint during police investigation

నటి భావన కేసులో పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. ఆమె కిడ్నాప్ అండ్ లైంగిక వేధింపుల అపహరణ కేసులో నటుడు దిలీప్ కు సహకరించిన వారి లిస్ట్ పెద్దదేనని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా దిలీప్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన నదీర్ షా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో నిజానిజాలు రాబట్టడానికి ఈ రోజు నదీర్‌ షాను కేరళ పోలీసులు ప్రశ్నించారు. దీంతో పోలీస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నదీర్ కు ఒక్కసారిగా రక్తపోటు పెరిగిపోయి, అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వైద్యులను హుటాహుటిన పిలిపించిన పోలీసులు ఆయనకు వైద్యం అందించారు.

న‌దీర్ షా పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ విచారణ ప్రారంభిస్తామ‌ని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. న‌దీర్ షా ఇలా ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌త‌కు గురవ్వ‌డం ఇది తొలిసారి కాదు. గ‌త నెల విచారణకు హాజరైన స‌మ‌యంలో కూడా ఆయ‌న ఇలాగే అస్వస్థతకు గురై బాధ‌ప‌డ్డాడు.

ఈ యేడాది ఫిబ్రవరిలో నటి భావన కొచ్చిలో కిడ్నాప్ గురై ఆపై లైంగిక వేధింపుల అనంతరం నిందితులు విడిపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని ఇచ్చిన సమాచారం మేరకు జూలై 10న నటుడు దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మూడు సార్లు ఆయనకు బెయిల్ నిరాకరణకు గురికాగా, నాలుగోసారి దరఖాస్తు చేసుకున్న బెయల్ పిటిషన్ పై కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles