Vivegam Teaser create International Record in YouTube | సౌతిండియన్ డిజాస్టర్ మూవీ.. ఇంటర్నేషనల్ రికార్డు

Vivegam teaser new record

Vivegam Movie, Ajith Kumar, Teaser, YouTube New Record, Ajith Vivegam International Record, Vivega, International Records, Ajith Vivegam Most Liked Teaser

Vivegam Movie Creates new record in YouTube. The teaser which became the most viewed one in the entire South India has now set a new record on YouTube. The movie surpassed the Star Wars new flick teaser likes and became the most viewed teaser on YouTube. This teaser has got 5 lakhs and eighty thousand likes.

వివేగం టీజర్ సరికొత్త రికార్డు

Posted: 09/16/2017 03:35 PM IST
Vivegam teaser new record

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వివేగమ్ (తెలుగులో వివేకం) చివరకు డిజాస్టర్ గానే మిగిలిపోయింది. తమిళంలో ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం దారుణ ఫలితాన్నే మిగిల్చింది. అయితే రెండు వారాల్లో 150 కోట్లు వసూళ్లు చేయటం ద్వారా అజిత్ కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ లిస్ట్ లో వివేగం చేరిపోయింది.

భారీ రిలీజ్, ఫస్ట్ వీక్ మొత్తం ఆ థియేటర్లలో అలాగే కొనసాగించటం ద్వారా అజిత్ చిత్రానికి ఈ రికార్డు దక్కింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. యూట్యూబ్ లో అత్యధిక లైక్స్ దక్కించుకున్న చిత్రంగా వివేగం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మొత్తం 5 లక్షల 80 వేల లైకులు ఈ చిత్రానికి దక్కాయి. హాలీవుడ్ లో వచ్చిన స్టార్ వార్స్ చిత్ర టీజర్ ను కూడా ఇది బీట్ చేయటం విశేషం. ఇక తమిళం విషయానికొస్తే వీకెండ్ లో బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయగా, అంతర్జాతీయ చిత్రాల లిస్ట్ లో వివేగం కూడా చేరిపోయింది. పాతికేళ్ల అజిత్ కెరీర్ స్పెషల్ గా విడుదలైన వివేగంలో కాజల్, అక్షర హీరోయిన్లుగా నటించగా, దరువు ఫేమ్ శివ దర్శకత్వం వహించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles