Surprising Screenplay for Chaitu's Yuddham Sharanam

Naga chaitanya reveal savyasachi movie concept

Naga Chaitanya, Savyasachi Movie, Director Chandoo Mondeti, Loose Hand Concept, Chaitu Not Control hand

Naga Chaitanya Reveals his Next Concept. Screenplay of Savyasachi will Surprise Everyone he added. Chandoo Mondeti Direct this typical concept movie.

చైతూ సవ్యసాచి కాన్సెప్ట్ చెప్పేశాడు

Posted: 09/07/2017 04:37 PM IST
Naga chaitanya reveal savyasachi movie concept

ప్రేమమ్ తర్వాత రా రండోయ్ తో మరో సక్సెస్ చవిచూసిన నాగ చైతన్య హ్యాట్రిక్ కోసం రేపు రేపు 'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఖచ్ఛితంగా హిట్ అయి తీరుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చైతూ. ఇక ఈ చిత్రం తర్వాత వెంటనే మరో క్రేజీ ప్రాజెక్టును డీల్ చేయబోతున్నాడు.

ప్రేమమ్ చిత్ర దర్శకుడు చందూ మొండేటితోనే 'సవ్యసాచి' చేయనున్నాడు. ఆ మధ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, అందులో కాన్సెప్ట్ అర్థం కాక తలలు పట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. యుద్ధం శరణం ప్రమోషన్ లో పాల్గొంటున్న చై కాన్సెప్ట్ ను రివీల్ చేసేశాడు. ఈ చిత్రంలో తన కుడిచేతికి ఎంత పవర్ ఉంటుందో .. ఎడమ చేతికి కూడా అంతే పవర్ ఉంటుందనీ, అందుకే 'సవ్యసాచి' అనే టైటిల్ పెట్టడం జరిగిందని తెలియజేశాడు.

పాత్ర పరంగా సినిమాలో తన బ్రెయిన్ కంట్రోల్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉండదని చెప్పాడు. తన కంట్రోల్ లో లేకుండా లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తూ ఉంటుందని అన్నాడు. మన శరీరంలోని ఒక అవయవం మన అధీనంలో లేకుండా పోతే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమాలో కీలకమని చెప్పాడు. అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతామని అన్నాడు. ఇదేదో హాలీవుడ్ కాన్సెప్ట్ లా ఉన్నప్పటికీ ఎలా వర్కవుట్ అవుతుందో చూద్దాం. ఇదిలా మారుతి చెప్పిన ఓ కాన్సెప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ అందులో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలన్న సలహాను మాత్రం రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles