Rohit Only Take Few Scenes Form Original Temper

Hindi temper script changed

Bollywood, Temper Movie, Director Rohit Shetty, Ranveer Singh, NTR, Original Story, Script Change

Bollywood top filmmaker Rohit Shetty acquired the remake rights and he announced that he is remaking the film in Bollywood.Rohit Shetty is not in a mood to adopt the complete film and instead he will be using 3-4 crucial episodes for the remake.

హిందీ టెంపర్ కథ మారుతుందంట!

Posted: 09/07/2017 04:13 PM IST
Hindi temper script changed

బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్ వరుస ఫెయిల్యూర్లతో ఉన్న తారక్ కు ఎంత రిలీఫ్ ఇచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కథతో కాకుండా పూరీ బయటి స్టోరీతో(వక్కంతం వంశీ) అందించిన కథతో బిగ్గెస్ట్ హిట్ నే అందుకున్నాడు. ఇక రెండేళ్లుగా ఈ చిత్రాన్ని వేరే భాషల్లో రీమేక్ చేయాలని పలువురు నిర్మాతలు అనుకుంటున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ లో అది కార్యరూపం దాల్చబోతుంది. యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ ప్రాజెక్టును డీల్ చేయబోతుండగా, రణ్ వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు. హీరోయిన్ గా ఆల్ మోస్ట్ కాజల్ నే కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ చిత్ర పూర్తి కథను తాను తీసుకోబోనని దర్శకుడు రోహిత్ చెబుతున్నాడు.

సినిమాలోని కేవలం నాలుగైదు కీలక ఎపిసోడ్లను తీసుకుని తాను చిత్రం తెరకెక్కించబోతున్నాడనని వెల్లడించాడు. మిగతా స్క్రిప్టంతా తానే సొంతంగా రాసుకోబోతున్నానని రోహిత్ చెప్పాడు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడంట. రోహిత్ శెట్టి ఇది వరకు అజయ్ దేవగన్ తో సింగం సిరీస్ ను తెరకెక్కించి హిట్లు కొట్టిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles