Anushka's Bhagmati Release in October

Anushka s bhagmati release date

Anushka Shetty, Bhagmati Movie, Release Date, October Month, Unni Mukundan, Jayaram

Anushka Shetty’s Bhagmati Release Date Shifted to October. The Makers Planned to Re Shoot Some Scenes. First Look may release on Dussera and Movie Release in October.

అక్టోబర్ లోనే భాగమతి రిలీజ్.. రీ షూట్ చేస్తారంట!

Posted: 09/07/2017 03:49 PM IST
Anushka s bhagmati release date

అప్పుడెప్పుడో బాహుబలి ఫస్ట్ పార్ట్ తర్వాత మొదలైంది అనుష్క భాగమతి షూటింగ్. మొత్తం షెడ్యూలన్నీ అయిపోయాయి. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటిదాకా రీలీజ్ డేట్ పై ఓ క్లారిటీ లేకుండా పోయింది.

ఈపాటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం ఎందుకు? డిలే అవుతోంది. దీనికి సమాధానం ఇప్పుడు దొరికింది. ఈ చిత్ర నిర్మాతలు యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు ఇప్పుడు దుమ్ము దుళిపే పనిలో పడిపోయారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ఇప్పుడు రిపేర్లు చేయబోతున్నారని సమాచారం. దసరాకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి.. అక్టోబర్ చివర్లో చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారంట. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మళయాళ నటులు ఉన్ని ముకుందన్, జయరామ్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు.

అయితే హడావుడిలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసేందుకు సీజీ వర్క్ సాయం తీసుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం అనుష్క నుంచి మరో వారం కాల్షీట్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 30 కోట్లతో అనుకున్న బడ్జెట్ గ్రాఫిక్స్ మూలంగానే 40 కోట్లకు చేరింది. దీంతో ఎలాగైనా చిన్న తేడా రాకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles