Vennela Kishore Joined in Bunny's Naa Peru Surya Movie.

Star comedian for naa peru surya

Vennela Kishore, Naa Peru Suya Movie, Allu Arjun, Anu Emmanuel, Vakkantham Vamsi

Star Comedian Vennela Kishore Joined in Allu Arjun's Naa Peru Surya Movie Shooting. Kishore Tweeted that News.

బన్నీ ‘సూర్య’ లో వెన్నెల కిషోర్

Posted: 09/06/2017 05:37 PM IST
Star comedian for naa peru surya

టాలీవుడ్ లో ఇప్పుడు వెన్నెల కిషోర్ హవా కొనసాగుతోంది. సీనియర్ కమెడియన్లు రాణించలేకపోతుండటం.. పైగా యువ కమెడియన్లు ఆయా చిత్రాలకే పరిమితం అవుతుండటం కిషోర్ కు బాగా కలిసి వస్తోంది. ముఖ్యంగా టైమింగ్ పంచ్ లకు పేరున్న ఇతగాడు ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాలన్నింటిలో కనిపిస్తున్నాడు.

ఈ మధ్య దువ్వాడ జగన్నాథమ్ లో బన్నీ పక్కన్న కనిపించిన వెన్నెల కిషోర్ ఇప్పుడు తర్వాతి చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగులో వెన్నెల కిషోర్ జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులుగా అక్కడ ప్రధానమైన పాత్రలకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాంకర్ టూ  స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రంతో డైరక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

బన్నీ .. వెన్నెల కిషోర్ కాంబోలో హిల్లేరియస్ కామెడీ సీన్లను తెరకెక్కించబోతున్నారంట. ఇక ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ కొత్త లుక్ తో .. మరింత ఫిట్ నెస్ తో కనిపించనున్నాడు. మేకోవర్ అదిరిపోయిందంటూ కిషోర్ ట్వీట్ కూడా చేశాడు. బన్నీ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇంకోవైపు చెర్రీ-సుక్కూ రంగస్థలంలోనూ వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles