SPYder Second Track Haali Haali Relesed

Mahesh spyder second song out

Mahesh babu, SPYder Move, Audio Songs, Haali Haali Song, Mahesh Haali Song, SPYder Haali Song, Haali Haali Telugu Song, SPYder Telugu Songs

Mahesh Babu SPYder Movie Second Song Released. Haali Haali Song Released with making Video.

స్పైడర్ సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది

Posted: 09/04/2017 06:28 PM IST
Mahesh spyder second song out

మహేష్ బాబు మురగదాస్ డైరక్షన్ లో నటిస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రానికి తెలుగు ఆడియో పంక్షన్ లేదన్న విషయం తెలిసిందే. ఈ నెల 9న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ లో తమిళ్ అడియోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే టైంలో తెలుగులో మాత్రం ఆన్ లైన్ లోనే పాటలు రిలీజ్ చేసి ప్రీరిలీజ్ పంక్షన్ కు ఫ్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కాసేపటి క్రితం చిత్రంలోని రెండో ట్రాక్ ను విడుదల చేశారు. పుచ్చకాయ.. పుచ్చకాయ.. అంటూ సాగే ట్రాక్ ను జీ మ్యూజిక్ సంస్థ ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. మహేష్ రకుల్ పై రూపొందించిన ఈ మాస్ బీట్ సాంగ్ లో తమిళ వాసన (లిరిక్స్) స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బీట్ పరంగా మాత్రం ఇది వరకే విన్న ఏదో పాత సాంగ్ బీట్ ను తలపించాడు మ్యూజిక్ డైరక్టర్ హ్యారిస్ జైరాజ్. కాకపోతే అరబిక్ సాంగ్ మాదిరి హలీ.. హాలీ అంటూ సాగే హమ్ ఆకట్టుకుంది.

 

ఇక మేకింగ్ వీడియోను కూడా పాటలో చూపించేశారు. మహేష్ కాస్టూమ్స్ కాస్త ఢిఫరెంట్ గా ఉండగా, సెట్ లో కూతురు సితార సందడి చేయటం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కు మంచి ఆదరణే రాగా, రెండో పాట ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh