Vijay Adirindi Aka Mersal Release Date Fixed

Vijay movie get release date in telugu

Vijay Mersal aka Adirindi, Adirindi Movie, Vijay Adirindi Movie, Vijay Movie Release Date, Vijay Mersal Big Release, Vijay Adirindi Telugu Market

Vijay Mersal aka Adirindi Movie Release Date Fix. May release on October 17 according to USA Update.

మెర్సల్ తెలుగు వర్షన్ రిలీజ్ డేట్

Posted: 09/04/2017 05:52 PM IST
Vijay movie get release date in telugu

కోలీవుడ్ మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే విజయ్ అనే చెప్పొచ్చు. ఆయన సినిమా వస్తుందంటే చాలు వాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. పండగ సీజన్ లో ఇదయదళపతి సినిమా వస్తే చాలూ అసలు పండగను పక్కన పెట్టేస్తుంటారు ఫ్యాన్స్. వాళ్లంతా కూడా ఇప్పుడు 'మెర్సిల్' (అదిరింది) సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఎమోజీలు, ట్రేడ్ మార్క్ హక్కులతో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉడబోతుందోనన్న ఆసక్తే అందరిలో నెలకొంది. రాజు రాణి, తేరి ఫేమ్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. యూఎస్ బిజినెస్ భారీగా జరిగిపోగా, చిత్ర ప్రీ షోల బుకింగ్ తో ఆ తేదీనే రిలీజ్ అవుతుందని అక్కడి నుంచి సంకేతాలు అందుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల సరసన కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో విజయ్ తో అట్లీ కుమార్ చేసిన 'తెరి' తమిళంలో హిట్ కొట్టి .. తెలుగులో 'పోలీస్'గా వచ్చి నిరాశ పరిచింది. ఈ సారి మాత్రం రెండు భాషల్లో సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడని అర్థమౌతోంది. మరి ఆ టైంకి కూడా తెలుగులో సినిమాలు కాచుకుని ఉండటంతో పోటీకి తట్టుకుంటాడా? అన్నదే డౌట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles