Indra Sena Movie First Look Unveiled by Chiranjeevi

Chiranjeevi unveils indra sena first look

Indra Sena Movie, First Look, Chiranjeevi, Radhika Sharathkumar, Vijay Antony, Fathima Antony

Indra Sena Movie First Look was unveiled on Tuesday by Megastar Chiranjeevi at his residence. Â The film stars Vijay Antony, and is the dubbed version of a Tamil film. Â It has been jointly produced by the yesteryear actress Radhika and Fatima Antony.

ఇంద్రసేన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిరు

Posted: 09/05/2017 03:25 PM IST
Chiranjeevi unveils indra sena first look

మెగాస్టార్ చిరంజీవి తమిళ మ్యూజిక్ డైరెక్టర్, హీరో విజయ్ ఆంటోనీ కొత్త చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇంద్రసేన పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం లుక్ ను మంగళవారం ఉదయం లాంఛ్ చేశారు.

ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై నటి రాధికా శరత్ కుమార్, విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా, శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తనకి ఎంతో ఆప్తురాలైన రాధిక నిర్మిస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని కథానాయకుడిగా తన సత్తా చాటుకున్నాడనీ, ఈ సినిమాకి ఆయన ఎడిటింగ్ కూడా చేస్తుండటం విశేషమని అన్నారు. విజయ్ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిస్తున్నానని చిరు తెలిపారు.

తమిళ్ లో 'అన్నాదురై'గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమర్షియల్ ఫార్మట్ తో చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా, నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles