పవన్ 25వ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్.. టైటిల్ అదేనా? | PK 25th Movie Concept Poser Released

Pk 25th movie concept poster release

Pawan Kalyan, Pawan Kalyan 25th Movie, PK 25th movie Concept Poster, PK 25th Movie, Videshi Payanam PK 25th

Pawan Kalyan 25th Movie Concept Poster Released. Trivikram Directorial venture released to Dasara, Videshi Payanam Title Consider.

పవన్ 25వ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

Posted: 09/01/2017 06:19 PM IST
Pk 25th movie concept poster release

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరక్షన్ లో  ప్ర‌స్తుతం ఒక సినిమా రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. రేపు పవన్ క‌ల్యాణ్‌ పుట్టినరోజు సంద‌ర్భంగా ‘పీఎస్‌పీకే#25’ హాష్ ట్యాగ్‌తో ఆ సినిమా యూనిట్ ఈ రోజు కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.

ఈ పోస్ట‌ర్ ద్వారా ప‌వ‌న్ కొత్త‌ సినిమా ఎలా ఉండబోతుందన్న విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ దీర్ఘాలోచ‌న‌లో ఉన్నట్లు ఒక చిత్రం ఉండ‌గా, మ‌రో చిత్రంలో ప‌వ‌న్ న‌డుస్తూ వెళుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. గత కొన్ని రోజులుగా విదేశీ పయనం లేదా పరదేశీ పయనం అన్న టైటిళ్లు పరిశీలనలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాన్సెప్ట్ ద్వారా అలాంటి విషయాన్నే తెలియజేస్తున్నాడేమో అన్న టాక్ వినిపిస్తోంది..

పవన్ కళ్యాణ్  కెరీర్ లో పాతికవ చిత్రం కావటం, పైగా గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోవటంతో చాలా జాగ్రత్తగా సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర నటుడు వెంకటేష్  ఓ గెస్ట్ రోల్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  25th Movie  Concept Poster  

Other Articles