బ్లాక్ బస్టర్ రీమేక్ అయినా ఫేట్ మారుస్తుందా? | Sunil Completed Two Countries Remake Shooting

Two countries telugu remake shooting completed

Actor Sunil Varma, Two Countries Movie Remake, Sunil Two Movies Relese, Ungarala Rambabu Release Date

Actor Sunil Varma Completed Two Countries Movie Remake. The Actor already Stars Dubbing Work.

టూ కంట్రీస్ రీమేక్ పూర్తి చేసిన సునీల్

Posted: 09/01/2017 04:30 PM IST
Two countries telugu remake shooting completed

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా వరుస కమిట్ మెంట్లు అందుకుంటున్నాడు హీరో సునీల్. అయితే గత కొన్నాళ్లుగా కెరీర్ గాడి తప్పటంతో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఉంగరాల రాంబాబు రిలీజ్ కు రెడీ కాగా, మరో చిత్రం షూటింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించాడు.

మళయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘2 కంట్రీస్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఎన్.శంకర్ దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ ‘2 కంట్రీస్’కు రీమేక్ గా తాను చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. కాగా, ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో నరేష్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. మరోపక్క క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఉంగరాల రాంబాబు సెప్టెంబర్ 15న విడుదల కానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Varma  Two Countries Remake  Director N Shankar  

Other Articles