రానా కొత్త అవతారం.. వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటాడా? | Rana Web Series First Look Released

Rana web series avatar reveal

Rana Daggubati, Rana Daggubati First Look, Rana Daggubati Web Series, Social Web Series, Social Rana Web Series

Rana Daggubati Web Series First Look Released. Social Web series starts soon

రానా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 09/01/2017 06:48 PM IST
Rana web series avatar reveal

ఘాజీతో హిట్ కొట్టాడు కూడా. బాహుబలి సంచలనాలు ముగిశాయి. వెంటనే నేనే రాజు నేనే మంత్రి సక్సెస్. ఆ వెంటనే టీవీ షోతో దూసుకుపోతున్నాడు. ఆల్ మోస్ట్ రానా ఇప్పుడు యంగ్ హీరోల్లో టాప్ స్టేజీలోనే ఉన్నాడు. ఇలాంటి టైంలో మరో ప్రయోగానికి కూడా రెడీ అయిపోయాడు దగ్గుబాటి వారసుడు.

వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు రానా. మిలీనియల్స్ పై సోషల్ మీడియా ఎఫెక్ట్ అనే థీమ్ పై ఈ వెబ్ సిరీస్ రూపొందగా.. థ్రిల్లర్ జోనర్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక్క క్లిక్ జీవితాలనే ఎలా మార్చేస్తుందనే అంశాన్ని ఈ వెబ్ సిరీస్ లో చూపనుండగా.. తాజాగా ఈ వెబ్ సిరీస్ సోషల్ కు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లుక్ విషయంలో పెద్దగా తేడా లేకపోయినా.. ఇంటెన్సిటీ చూపించడంలో మాత్రం రానా భలే సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

డిజిటల్ ప్లాట్ ఫాంతో తన మొదటి అనుబంధం ఈ వెబ్ సిరీస్ అంటూ.. ఫస్ట్ లుక్ లాంఛ్ సందర్భంగా చెప్పాడు రానా. సెప్టెంబర్ 8న ఈ సోషల్ వెబ్ సిరీస్ లాంఛ్ కానుండగా.. మొత్తం 13 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఉంటుందని మేకర్లు చెబుతున్నారు. వాక్డ్ ఔట్ మీడియా.. గురు ఫిలిమ్స్ లు కలిపి నిర్మించిన ఈ సోషల్ లో నవీన్ కస్తూరియా నటిస్తుండగా.. శశి సుడిగాల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. తప్పిపోయిన అమ్మాయిని సోషల్ మీడియా ఎలా కనిపెడుతుంది అన్న కాన్సెప్ట్ తో చిత్రం తెరకెక్కబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Web Series  First Look  

Other Articles