సారీ... అసలు ఎవరో కూడా తెలీదు | Venu Madhav says Sorry I Don't Know Roja

Venu madhav interesting comments on roja

Venu Madhav Pawan Kalyan, Venu Madhav Roja, MLA Roja Counter Venu Madhav, Venu Madhav TDP, Venu Madhav nandyala By Poll, Venu Madhav Satires YS Jagan, Venu Madhav Jagan Roja

Actor Venu Madhav in Nadyala Poll Campaign. Venu Madhav Says He Don't Know MLA Roja.

రోజాపై వేణు మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 08/18/2017 06:34 PM IST
Venu madhav interesting comments on roja

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ వేణుమాధవ్ నటి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడన్న వార్తలు నిన్నంతా హల్ చల్ చేసిన విషయం తెలిసింది. టాటూలు.. చిట్టి బట్టలు అంటూ కామెంట్ చేశాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే నేడు ప్రచారంలో వేణు మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నారు.

సినీ గ్లామర్ ఉన్న రోజాకు పోటీగానే మిమల్ని దించారని మీడియా అడిగిన ప్రశ్నకు సారీ... రోజా ఎవరో నాకు తెలియదంటూ వేణుమాధవ్ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున హాస్యనటుడు వేణుమాధవ్ ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక ‘నేను నా డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర, అలాగే, టీడీపీ ఆఫీసులో పని చేసేవాడిని. కాబట్టి, టీడీపీతో, నందమూరి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. భూమా నాగిరెడ్డి కుటుంబంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే ఈ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

 

చిరంజీవి, నాగబాబు సహా పవన్ కళ్యాణ్ కూడా భూమా కుటుంబంతో మంచి సంబంధం ఉండేదని, పైకి సపోర్ట్ ఇవ్వలేనని చెప్పినప్పటికీ లోపల మాత్రం పవన్ కి భూమా వారసుడికే మద్ధతు ఇవ్వాలని ఉందని వేణు మాధవ్ చెబుతున్నాడు. తాము మెజార్జీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని చెబుతూ సెలవు తీసుకున్నాడు. అయితే రోజాపై వేసిన కౌంటర్ కు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venu Madhav  MLA Roja  Nandyala By Election  

Other Articles